Viral: రెండు తలల కొండ చిలువ.. చూస్తే జలక్

అత్యంత అరుదైన రెండు తలల బాల్ పైథాన్ వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఈ విషరహిత జాతి పైథాన్ రెండు తలలతో సంచరిస్తూ ప్రకృతి ప్రేమికుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Viral: రెండు తలల కొండ చిలువ.. చూస్తే జలక్

విధాత: ప్రకృతిలోని జీవరాశులలో సరీసృపాల జాతి ప్రత్యేకమైంది. రకరకాల పాముల జాతులు విభిన్న రూపాలు.. జీవన శైలులతో ప్రకృతి ప్రేమికులను విస్మయానికి గురి చేస్తుంటాయి. సహజంగా పాములు ఒక తలతోనే ఉంటాయి. పురాణాల్లో పది తలల పాము వంటి కథలు ఉన్న..అనంతర కాలాల్లో వాటిని చూసిందెవరు లేరు. పాముల జాతులలో విష రహితమైన రెండు తలల పాము(రెండ్ శాండ్ బోవా) అందరికి తెలిసిందే. అయితే అది తోక భాగం, తల భాగం రెండువైపుల నుంచి సంచరించే లక్షణంతో రెండు తలల పాముగా పిలువబడింది. అయితే తల భాగంలోనే రెండు అంతకుమించి తలలతో ఉన్న పాములు కూడా విశాల ప్రకృతిలో ఎక్కడో ఒక చోట వెలుగుచూస్తున్నాయి. అలాంటి ఓ రెండు తలల కొండ చిలువ వీడియో ఒకటి వైరల్ గా మారింది.

రెండు తలల అరుదైన కొండచిలువ శాస్త్రీయ నామం బాల్ పైథాన్. దీనినే పైథాన్ రెజియస్, రాయల్ పైథాన్ అని కూడా పిలుస్తారు. ఇది పశ్చిమ, మధ్య ఆఫ్రికాకు చెందిన ఒక పైథాన్ జాతి. అక్కగి గడ్డి భూములు, పొదలు, బహిరంగ అడవులలో నివసిస్తుంది. ఈ విషరహిత కొండ చిలువల జాతి. ఆడ బాల్ కొండచిలువలు సగటున 3 నుండి 5 అడుగుల పొడవు, మగ బాల్ కొండచిలువలు సగటున 2 నుండి 3 అడుగుల పరిమాణంలో ఉంటాయి. అయితే ఓ బాల్ ఫైథాన్ రెండు తలలతో జన్మించి పెరుగుతుంది. ఇది రెండు తలలతో సంచరిస్తూ చూడటానికి పురాణాల్లోని పది తలల పామును తలపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. జన్యుపరమైన లోపాలతో అత్యంత అరుదుగా ఇలా రెండు తలలతో పాములు జన్మిస్తాయని శాస్త్రవేత్తల కథనం.

బాల్ పైథాన్‌లు వివిధ రంగులు, చర్మపు డిజైన్లలో లభిస్తాయి. వీటిని ‘మార్ఫ్స్’ అని పిలుస్తారు. లేత రంగుల నుంచి ముదురు చారల వరకు ఎన్నో రకాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి. సరైన వాతావరణం కల్పిస్తే ఇవి 20 నుంచి 30 సంవత్సరాల వరకు జీవిస్తాయి. వీటిని ఎక్కువుగా పెంచుకునేందుకు వాడుతుంటారు. ప్రశాంతమైన పెంపుడు జంతువును కోరుకునే వారికి బాల్ పైథాన్ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుందంటారు సరీసృప ప్రేమికులు.

Also Read- బైక్ లో దూరిన నాగుపాము హల్చల్