మూడు పాముల సయ్యాట.. రైతుల పరుగో పరుగు!

పంట పొలాల్లో పరవశించి మదన తాపంతో రెచ్చిపోయిన మూడు పాములు పరస్పరం సయ్యాటకు దిగాయి. పాముల సయ్యాటల సందడి చూసిన.. రైతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | May 14, 2026, 5:13 pm IST
Read Time: 2 mins
మూడు పాముల సయ్యాట.. రైతుల పరుగో పరుగు!

పంట పొలాల్లో పరవశించి మదన తాపంతో రెచ్చిపోయిన మూడు పాములు పరస్పరం సయ్యాటకు దిగాయి. పాముల సయ్యాటల సందడి చూసిన.. రైతులు బెదిరిపోయి అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. ఈ అరుదైన ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా వంగర మండలం మద్దివలస వద్ద చోటుచేసుకుంది.

సహజంగా రెండు పాముల సరసాల సయ్యాటలే కనిపిస్తుంటాయి. అయితే స్థానిక పంటపొలాల్లో మూడు పాములు ఒకేచోట పరస్పరం పెనవేసుకుంటూ సయ్యాటతో పరవశించాయి. ఈ అరుదైన దృశ్యాన్ని స్థానికి రైతులు వీడియో తీయగా.. అదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రతికేళిలో మునిగితేలుతున్న పాముల సయ్యాట సందడిని చూస్తున్న రైతులను పాములు గమనించడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.

 

ఇవి కూడా చదవండి :

WhatsApp | వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఏఐ‌తో చాట్ ఇక మరింత భద్రం.. కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తున్న మెటా!
Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!