వరి పొలం గట్ల వెంట ఓ బాలిక పరిగెడుతుండగా, ఆమె వెనుక ఒక ముళ్లపంది వెలుతున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి వైరల్ మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ బాలికను డిస్నీ యువరాణిగా అభివర్ణిస్తున్నారు. ఈ వీడియో శ్రీలంకకు చెందిన బాలికది కావడం విశేషం. శ్రీలంకలోని పొలొన్నరువలో చిత్రీకరించబడిన ఈ వీడియోలో బాలిక ముందుగా పొలం గట్లలో ఓ పిల్లిని ఎత్తుకుని కనిపిస్తుంది. ఆమె వెనుక ఓ ముళ్ల పంది అనుసరిస్తుంది. ఆ తర్వాత బాలిక పొలం గట్ల వెంట గెంతులేస్తూ ముందుకెలుతుండగా ముళ్ల పంది ఆమెనే అనుసరిస్తు వెళ్లడం ఆశ్చర్యపరస్తుంది. సహజంగా వన్యప్రాణియైన ముళ్లపంది ఆ బాలికతో స్నేహం పెంచుకోవడం ఆసక్తి రేపుతుంది.
ఓ రోజు కుక్కలు కరిచిన తర్వాత ఆ బాలిక, ఆమె కుటుంబం ఆ ముళ్ళపందిని రక్షించింది. దీంతో ఆ ముళ్లపంది వారిపై అభిమానం పెంచుకుని వారితో తరుచూ కలిసి ఉండటం కొనసాగిస్తుంది. ముళ్లపందితో పాటు దాని వెంట వచ్చే అడవి పిల్లులను కూడా ఆ కుటుంబం సంరక్షిస్తుండటంతో అవి వారికి మచ్చికగా మారిపోయినట్లుగా సమాచారం. ఆ ముళ్లపంది, పిల్లులతో ఆ బాలిక సింహళం భాషలో సంభాషిస్తుండటం..అవి ఆ బాలిక మాటలను అర్ధం చేసుకుని మెలుగుతుండం ఈ వ్యవహారంలో మరింత ఆసక్తికరం. ఆశ్చర్యకరమైన ముళ్లపంది, బాలిక, అడవి పిల్లుల స్నేహం వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా…నెటిజన్లు ఆ బాలికను డిస్నీ యువరాణిగా పేర్కొనడం విశేషం. శాఖహారులైన ముళ్ల పందులు సహజంగా మనుషులపైన దాడి చేయవు. ఏదైన జంతువు నుంచి ప్రమాదం అనిపించినప్పుడు శరీరాన్ని గుండ్రటి ముళ్ల బంతిలా మార్చుకుంటాయి. శత్రువులు వాటిని తాకినప్పుడు లేదా దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు పదునైన ముళ్లు గుచ్చుకుంటాయి. ముళ్లు శరీరం లోతుగా దిగితే కండరాలకు గాయాలు కావడం, విషపూరిత ఇన్‌ఫెక్షన్లు లేదా చీము పట్టడం వంటి సమస్యలు వస్తాయని వన్యప్రాణుల నిపుణుల కథనం.
A little girl from Sri Lanka and a tiny porcupine have captured millions of hearts around the world. 🇱🇰❤️
Their adorable friendship has gone viral, with many calling her a real-life Disney princess. ✨ pic.twitter.com/78e0yT6tOC
— NewsWire 🇱🇰 (@NewsWireLK) June 29, 2026