Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!

Milk Price Hike | సామాన్యులకు మరో షాక్! అమూల్, మదర్ డెయిరీ సంస్థలు తమ పాల ధరలను అమాంతం పెంచేశాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, ప్రీమియం వేరియంట్లపై లీటర్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

Reported by: Chandram | జాతీయం | May 14, 2026, 7:18 am IST
Read Time: 3 mins
Milk Price Hike | అమూల్, మదర్ డెయిరీ పాల ధరల పెంపు.. నేటి నుంచే అమలు!

Milk Price Hike | సామాన్యులకు మరో షాక్! అమూల్, మదర్ డెయిరీ సంస్థలు తమ పాల ధరలను అమాంతం పెంచేశాయి. ఫుల్ క్రీమ్ మిల్క్, టోన్డ్ మిల్క్, ప్రీమియం వేరియంట్లపై లీటర్‌కు రూ.2 నుంచి రూ.5 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలను ఇవాల్టి (మే14) నుంచి అమల్లోకి వచ్చాయి.

గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ మార్కెటింగ్ చేసే అమూల్ సంస్థ లీటర్ పాలపై రూ.2 వరకు పెంచింది. దీంతో అమూల్ గోల్డ్ (ఒక లీటర్) ధర రూ.68 నుంచి 70కి పెరిగింది. అమూల్ తాజా ధర రూ.55 నుంచి రూ.57కు చేరుకుంది. అలాగే అరలీటర్ అమూల్ గేదె పాలు రూ.38 నుంచి రూ.39కి పెరగ్గా.. ఆవు పాల ధర రూ.29 నుంచి రూ.30కి పెరిగింది.

ఇక మదర్ డెయిరీ విషయానికి వస్తే ఒక లీటర్ గేదె పాల ధరను ఏకంగా రూ.75 నుంచి రూ.80కి పెంచింది. ఫుల్ క్రీమ్ మిల్క్ పాల ప్యాకెట్ ధరను రూ.69 నుంచి 72కి పెంచింది. టోన్డ్‌, డబుల్ టోన్డ్, ఆవు పాలు, ప్రో మిల్క్ వేరియంట్ల ధరల్లో కనీసం రూ.2 పెంపు చోటు చేసుకుంది. నిర్వహణ, సేకరణ, రవాణా ఖర్చులు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా రెండు డెయిరీలు వెల్లడించాయి.

 

Read More:

బీఆర్ఎస్‌లో తగ్గని ‘బీటీ బ్యాచ్’ హవా! వాళ్లకే ఇన్‌చార్జ్‌ పగ్గాలు

ఐదు సీట్లిస్తే.. వెయ్యి కోట్లిస్తా… బీజేపీకి ఓ మాజీ మంత్రి బంపర్ ఆఫర్!