భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,650 తగ్గి రూ.1,45,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,350 తగ్గి రూ.1,33,700 నిలిచింది. కిలో వెండి ధరలు సైతం రూ.1,5000 తగ్గి రూ. 2,55,000 పడిపోయింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 19, 2026, 11:34 am IST
Read Time: 3 mins
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు

పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు సద్దుమణగడం, అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ‘ఫెడరల్ రిజర్వ్’ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందనే సంకేతాల నేపథ్యం పసిడి ధరల తగ్గుదలకు కారణమైంది. అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గిపోయాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,650 తగ్గి రూ.1,45,860 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,350 తగ్గి రూ.1,33,700 నిలిచింది. కిలో వెండి ధరలు సైతం రూ.1,5000 తగ్గి రూ. 2,55,000 పడిపోయింది.

కొనుగోలుకు మంచి ఛాన్స్

అంతర్జాతీయంగా, దేశీయంగా చోటుచేసుకున్న కొన్ని ముఖ్యమైన ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరల తగ్గుదలకు ప్రధాన కారణమయ్యాయి. స్వల్పకాలికంగా ధరలు ఎక్కడైనా తగ్గితే, దానిని ఇన్వెస్టర్లు సరికొత్త కొనుగోలు అవకాశంగా మలచుకోవచ్చని సూచిస్తున్నారు. ధరలు తగ్గినప్పుడు మళ్లీ పుంజుకోవడం సాధారమైనందునా..అవసరమైన వారికి పసిడి, వెండి కొనుగోలుకు ఇదే మంచి ఛాన్స్ అని నిపుణులు సూచిస్తున్నారు. భవిష్యత్తులో మళ్లీ ధరలు తిరిగి పుంజుకునే అవకాశం ఉందంటున్నారు. అందుకే శుభాకార్యాలకు పసిడి అవసరమైనవారు, పెట్టబడి మార్గంగా భావించే వారు.. ప్రస్తుత ధరలలో బంగారం, వెండి కొనుగోలు చేయడంలో.. మార్కెట్ పరిణామాలు అంచనా వేసి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.