చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావానికి చిన్నారులను దూరంగా ఉంచేందుకు ప్రపంచంలోని పలు దేశాలు ఆంక్షలను అమలు చేస్తున్నాయి. తాజాగా యూఏఈ కూడా 15 ఏళ్లు నిండితేనే సోషల్ మీడియా ఖాతాలు వినియోగించేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తీర్మానాన్ని గురువారం ఆమోదించింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది. పిల్లలు గంటలకొద్దీ సమయాన్ని స్క్రీన్‌కు కేటాయించడం వల్ల వారిలో తలెత్తుతున్న ఆరోగ్య, మానసిక సమస్యలను నివారించడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, యూకే ఈ తరహా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చాయి. తొలుల ఆస్ట్రేలియా ఈ చట్టాన్ని అమలులోకి తీసుకరాగ..తదుపరి ఫ్రాన్స్ అమలు చేసింది. ఫ్రాన్స్ లో సోషల్ మీడియాపై నిబంధనలు సెప్టెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 15 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను తొలగించడానికి సామాజిక మాధ్యమాల సంస్థలకు డిసెంబరు 31 వరకు సమయం ఫ్రాన్స్ ప్రభుత్వం సమయం ఇచ్చింది. బిల్లులో పాఠశాలల్లో పిల్లల మొబైల్ ఫోన్ వాడకం పైనా నిషేధం కూడా చేర్చారు. ఇటీవల బ్రిటన్ కూడా దేశంలోని పదహారేళ్ల కన్నా తక్కువ వయసున్నవారు సోషల్ మీడియా వాడకుండా నిషేధత చట్టాన్ని తీసుకొచ్చింది. 2027 ప్రారంభం నుండి ఈ నిషేధాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్ననట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు.