రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!

బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి డీజిల్ చోరీ చేసిన వీడియో వైరల్ అయింది. రైల్వే భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Reported by: Tejaswini Nanna | ట్రెండింగ్ | Jun 18, 2026, 12:59 pm IST
Read Time: 3 mins
రైలు నుంచి డీజిల్ కొట్టేశాడు..వైరల్ వీడియో!

దోచుకోవడానికి ఏదైతే నాకేంటి అన్నట్లుగా ఉంది ఓ దొంగ దోపిడి ఉదంతం. ఏకంగా ఓ రైలు నుంచి డీజిల్ దొంగతనం చేసి..తన చోర కళా నైపుణ్యాన్ని ప్రదర్శించగా..ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బీహార్‌లోని సీతామర్హి స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు నుంచి ఓ వ్యక్తి దర్జాగా డీజిల్ చోరీ చేశారు. పక్కనే ఉన్న రైలు ప్రయాణికులు ఈ దృశ్యాన్ని ఫోన్లలో చిత్రీకరిస్తున్నప్పటికి..అదేమి పట్టించుకోకుండా, ఏమాత్రం భయం లేకుండా అతను తన చోరీ పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటిదాక మైటార్ సైకిళ్లు, కార్లు, యంత్రాల నుంచి ఇంధన చోరీ చూశామని..ఏకంగా రైలు నుంచి డీజిల్ కొట్టేసిన వాడు ఏవడో కాని..వాడు మాములోడు కాదంటూ ఆ దొంగ చోరకళా నైపుణ్యం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం రైలు నుంచి డీజిల్ కొట్టేస్తున్న ఈ ఘటన చూస్తుంటే..రైల్వే ఆస్తుల భద్రతపై సందేహాలు రేకెత్తుతున్నాయంటూ కామెంట్లు పెడుతున్నారు.