మళ్లీ పెరిగిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

శుక్రవారం పసిడి ధరలు మరోసారి పెరుగుదల నమోదు చేయగా..వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మర్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.270 పెరిగి రూ. 1,44,600 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 250 పెరిగి రూ. 1,32,550 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద స్ధిరంగా నిలిచింది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jul 31, 2026, 10:56 am IST
Read Time: 2 mins
మళ్లీ పెరిగిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితులు, ద్రవ్యోల్బణ గణాంకాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పసిడి,వెండి ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. అయితే శుక్రవారం పసిడి ధరలు మరోసారి పెరుగుదల నమోదు చేయగా..వెండి ధర స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ బులియన్ మర్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.270 పెరిగి రూ. 1,44,600 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 250 పెరిగి రూ. 1,32,550 వద్ద ట్రేడవుతోంది. కిలో వెండి ధర రూ. 2,35,000వద్ద స్ధిరంగా నిలిచింది.

ప్రస్తుత ధరలు కొనుగోలుకు ఉత్తమ అవకాశం

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం సానుకూలంగానే ఉన్నాయని ఈ ధరల వద్ద కొనుగోలు ఉత్తమ అవకాశం అని నిపుణులు సూచిస్తున్నారు. ధరల హెచ్చు తగ్గులను గమనిస్తూ కొద్ది కొద్దిగా కొనుగోలు చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. రూ. 1,39,500 ధరల నుంచి రూ. 1,49,000 ధర వరకు పసిడి కొనుగోలు చేయవచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు. వెండి కొనుగోలులోనూ రూ.2,38,000 ధర వరకు కొనుగోలు చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.