ఫార్ములా ఈ కార్ రేసు ఏసీబీ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరయ్యారు. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కేటీఆర్ ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో ఏ2గా ఉన్న ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా ఉన్న మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలు సమన్లతో తొలిసారి విచారణకు హాజరై వాటిని కోర్టుకు సమర్పించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 25కు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెచ్ఎండీఏ నిధుల నుంచి దాదాపు రూ.55 కోట్లను ఆర్బీఐ, కేబినెట్ ఆమోదం లేకుండా విదేశీ సంస్థకు బదిలీ చేశారనే కేసులో ఏసీబీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్‌లో కేటీఆర్ ను ఏ-1గా, ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను ఏ-2గా, మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చింది. ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితులకు సమన్లు జారీ చేయడంతో కేటీఆర్ నేడు విచారణకు హాజరయ్యారు.