అమెరికా- ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ద ఉద్రిక్తతలు సద్దుమణగడం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి లావాదేవిలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధరలు గత నాలుగు రోజులుగా తగ్గిపోగా..శనివారం స్పల్పంగా పుంజుకున్నాయి.
దేశీయంగా 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 220 పెరిగి రూ.1,46,080 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల 10గ్రాముల బంగారం ధర రూ. 200తగ్గి రూ. 1,33,900 వద్ద నిలిచింది. వెండి ధర మాత్రం రూ,2,55,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.
ప్రస్తుత మార్కెట్ స్తబ్దంగా ఉన్నప్పటికీ, ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ గ్లోబల్ రీసెర్చ్ మాత్రం బంగారం ధరలు భవిష్యత్తులో రూ. 2లక్షల మార్కును చేరుకుంటాయన్న అంచనాలకు కట్టుబడి ఉండటం గమనార్హం. 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర $6,000 మార్కును తాకుతుందని, అలాగే 2027 చివరి నాటికి అది మరింత పుంజుకుని $6,300కు చేరుకుంటుందని ఈ బ్యాంక్ బలంగా అంచనా వేస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం, చమురు ధరలు తగ్గి, అమెరికా డాలర్ విలువ కూడా క్షీణించే అవకాశం ఉండటం, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరాయంగా బంగారాన్ని కొనుగోలు చేయడం, ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల నిర్ణయం, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో పెరుగుతున్న అనిశ్చితి వంటి నిర్మాణాత్మక అంశాలు బంగారం ధరలను భవిష్యత్తులో భారీగా పెంచుతాయని జేపీ మోర్గాన్ విశ్వసిస్తోంది.