స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా.. శాంతి పరిస్థితులు బంగారం,వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 16, 2026, 1:00 pm IST
Read Time: 2 mins
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ద ఉద్రిక్తతలు సద్దుమణుగడంతో అంతర్జాతీయంగా భౌగోళిక, ఆర్థిక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అంతర్జాతీయంగా సాధారణ పరిస్థితులు నెలకొంటుండగా.. శాంతి పరిస్థితులు బంగారం,వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

మంగళవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 160 తగ్గి రూ. 1,51,370వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 1,38,750 వద్ద ఆగింది. కిలో వెండి ధర సైతం రూ 5,000 తగ్గి రూ.2,75,000కు దిగి వచ్చింది.

అయితే భారత్ లో శుభాకార్యాల సీజన్ తిరిగి ప్రారంభం కావడం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో బంగారం ధరలు తాత్కాలికంగా తగ్గినప్పటికి..మునుముందు ధరలు మళ్లీ పెరుగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ధరలపై అయోమయం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత ధరల వద్ద శుభాకార్యాల కోసం బంగారం అవసరమైన వారు…కొద్ది కొద్దిగా మార్కెట్ ను అంచనా వేస్తూ కొనుగోలు చేసుకోవచ్చంటున్నారు.