పశ్చిమ ఆసియాలో (మధ్యప్రాచ్యం) నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, దౌత్యపరమైన శాంతి చర్చలతో యుద్దభయాలు తొలగిపోవడంతో అంతర్జాతీయంగా కమోడిటీ మార్కెట్లలో సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలలో అంతర్జాతీయంగా కదలికలు బలపడగా మెల్లగా ధరలు పుంజుకుంటున్నాయి. శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 500 పెరిగి రూ. 1,49,080 వద్ద కొనసాగుతుంది, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధ రూ. 450 పెరిగి రూ. 1,36,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర రైతం రూ. 5000 పెరిగి రూ. 2,70,000కు చేరింది.
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ప్రేమికులకు, ముఖ్యంగా వివాహాల కోసం నగలు కొనాలనుకునే కుటుంబాలకు బంగారం ధరలు ప్రస్తుతం సానుకూలంగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. చాలామంది ధరలు తగ్గుతాయేమోనని తమ కొనుగోళ్లను వాయిదా వేసుకుంటూ వచ్చారు. అటువంటి వారికి ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న ఈ సానుకూల ట్రెండ్ ఒక అద్భుతమైన అవకాశంగా నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ చర్చల వల్ల మార్కెట్లో శాంతి వాతావరణం ఏర్పడి ధరలు తగ్గినప్పటికీ, భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి అనిశ్చితి తలెత్తినా ధరలు పెరిగే అవకాశం లేకపోలేదు.
అందువల్ల, పెళ్లిళ్ల కొనుగోలుదారులు మొత్తం బంగారాన్ని ఒకేసారి కొనకుండా, “స్టాగర్డ్ బయింగ్” విధానాన్ని పాటించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అంటే, వివాహానికి అవసరమైన నగలను విడతల వారీగా, ధరలు తగ్గిన ప్రతిసారీ కొంచెం కొంచెంగా కొనుగోలు చేయడం ద్వారా సగటు ధర ప్రయోజనాన్ని పొందవచ్చంటున్నారు. ప్రస్తుత ధరల వద్ద పెళ్లిళ్ల సీజన్ కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఇది సరైన సమయంగా నిపుణులు చెబుతున్నారు.