విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ తో పాటుగా పసిడి మార్కెట్ కూడా తీవ్ర ఒడిదడుకులకు లోనవుతుంది. గత రెండు రోజులగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్ లో శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,940 పెరిగి రూ.1, 48,580కి పెరిగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,700 పెరిగి రూ. 1,36,200 పెరిగింది. కిలో వెండి ధర రూ. 5,000 పెరిగి రూ. 2,65,000కి చేరింది.

కొనుగోలుపై సందిగ్ధత

బంగారం ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టగా…మునుముందు పెరుగుతాయా లేక తగ్గుతాయా అన్న ప్రశ్నల మధ్య కొనుగోలుదారులు సందిగ్ధతలో పడిపోతున్నారు. పశ్చిమాసియా సంక్షోభం సద్దుమణిగి, అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లలో పెద్దగా మార్పులు లేని పక్షంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో భారత్ లో శుభ కార్యాల సమయం రావడంతో ప్రస్తుత ధరల వద్ద బంగారం, వెండి కొనుగోలుకు జనాలు ఆసక్తి చూపే అవకాశం లేకపోలేదంటున్నారు.