స్థిరంగా బంగారం, వెండి ధరలు

ఆదివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.1,52, 730వద్ద స్థిరంగా ఉంంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.1,40,000 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,70,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 07, 2026, 12:09 pm IST
Read Time: 2 mins
స్థిరంగా బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో బంగారం ధరలలో అస్థిరత కొననసాగుతుంది. అయితే ఆదివారం మాత్రం బంగారం, వెండి ధరలలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.  బులియన్ మార్కెట్ లో  24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.1,52, 730వద్ద స్థిరంగా ఉంంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.1,40,000 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 2,70,000వద్ద నిలకడగా కొనసాగుతుంది.

విశ్లేషకుల ప్రాథమిక అంచనా ప్రకారం, మధ్యప్రాచ్యంలో ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరో రెండు నెలల పాటు కొనసాగి సద్దుమణుగవచ్చని భావిస్తున్నారు. ఫలితంగా బ్రెంట్ ముడి చమురు ధరలు తగ్గి ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుతుందని, దీంతో ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చన్నారు. ప్రస్తుతం మరికొంత కాలం బంగారం ధరలు నియంత్రణలో ఉండనున్నప్పటికి…భవిష్యత్తులో పెరుగవచ్చంటున్నారు నిపుణులు.