భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.4,300 తగ్గగా, కిలో వెండి రూ.10,000 పడిపోయింది. పెట్టుబడిదారులు తాజా ధరలపై దృష్టి సారిస్తున్నారు.

Reported by: Tejaswini Nanna | వాణిజ్యం | Jun 10, 2026, 12:27 pm IST
Read Time: 2 mins
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ద ఉద్రిక్తతలు పెరగిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మార్కెట్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం, వెండి ధరలు పలు మార్పులకు లోనవుతున్నాయి. అయితే బుధవారం బంగారం, వెండి ధరలు అనూహ్యంగా భారీగా తగ్గుముఖం పట్టాయి.

బులియన్ మార్కెట్ లో బుధవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 4,300తగ్గి రూ. 1,48,860కి పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 3,950 తగ్గి రూ. 1,36,450వద్ద నిలిచింది. జూన్ 1న 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,56,220గా ఉండగా..పది రోజులలో హెచ్చుతగ్గులకు గురవుతూ బుధవారానికి రూ.7,360తగ్గడం విశేషం. కిలో వెండి ధర సైతం భారీగా తగ్గింది. రూ. 10,000తగ్గి రూ. 1,260,000కు పడిపోయింది. జూన్ 1వ తేదీన రూ.2,90,000వద్ద కిలో వెండి ధర పది రోజుల వ్యవధిలోనే రూ.30వేలు పడిపోవడం గమనార్హం.