తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

సోమవారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ. 1,51,690 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 తగ్గి రూ.1,39,050 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 2,70,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 08, 2026, 1:01 pm IST
Read Time: 2 mins
తగ్గిన బంగారం..స్థిరంగా వెండి ధరలు

ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి నేపథ్యంలో మరోసారి పశ్చిమాసియాలో యుద్ద ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. దీంతో బంగారం ధరలు తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. అమెరికాతో శాంతి ఒప్పందానికి సిద్దమైనట్లే కనిపించిన ఇరాన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఇజ్రాయెల్ పై బాంబుల మోత మోగిస్తుంది. దీంతో ఆ రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రికత్తలు చెలరేగుతున్నాయి. ఈ పరిణామాలతో పసిడి మార్కెట్ మరోసారి ఒడిదుడుకులకు లోనవుతోంది.

సోమవారం బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,040 తగ్గి రూ. 1,51,690 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 950 తగ్గి రూ.1,39,050 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 2,70,000వద్ద కొనసాగుతుంది. యుద్ద ఉద్రిక్తతలు సఢలిపోయి..ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో పెద్దగా మార్పు లేకుంటే బంగారం ధరలు భవిష్యత్తులో పుంజుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.