Hero Super Splendor | 72కి.మీ. మైలేజీతో కొత్త హీరో సూపర్ స్ప్లెండర్.. ధర ఎంతంటే..!

Hero Super Splendor | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ సూపర్‌ స్ల్పెండర్‌‌కు ఆధునిక ఫీచర్లతో ఆప్‌గ్రేడ్ చేసింది. Super Splendor XTEC 2.0 మోడల్‌ను ఇటీవల భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది.

Reported by: Chandram | వాణిజ్యం | Jun 08, 2026, 10:57 pm IST
Read Time: 6 mins
Hero Super Splendor | 72కి.మీ. మైలేజీతో కొత్త హీరో సూపర్ స్ప్లెండర్.. ధర ఎంతంటే..!

Hero Super Splendor | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోడల్ సూపర్‌ స్ల్పెండర్‌‌కు ఆధునిక ఫీచర్లతో ఆప్‌గ్రేడ్ చేసింది. Super Splendor XTEC 2.0 మోడల్‌ను ఇటీవల భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధర రూ.86,500(ఎక్స్ షోరూం)గా నిర్ణయించింది. ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన టెక్నాలజీ ఫీచర్లు, అధిక మైలేజీతో ఈ మోడల్‌ను తీసుకొచ్చినట్లుగా కంపెనీ వెల్లడించింది.

కొత్త Splender XTEC 2.0లో 124.7సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7500rpm వద్ద 10hp శక్తిని, 6000 rpm వద్ద 10.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నగర ప్రయాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఇంజిన్ మెరుగైన పనితీరుతో పాటు ఇంధనాన్ని చాలా వరకు ఆదా చేస్తుందని పేర్కొంది. ఈ బైక్ లీటర్‌ పెట్రోల్‌కు 72కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని ప్రకటించింది. ఇందుకోసం అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్‌డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (APFI), i3S (Idle Stop Start System) వంటి టెక్నాలజీను ఉపయోగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బైక్ ఆపినప్పుడు ఇంజిన్ స్వయంచాలకంగా ఆగిపోవడం, క్లచ్ నొక్కగానే తిరిగి స్టా్ర్ట్ అవ్వడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

Splender XTEC 2.0 బైక్‌లో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేట్ (ISG)ను కూడా అందించారు. దీనివల్ల ఇంజిన్ స్టార్ట్ చేసే సమయంలో శబ్దం పెద్దగా ఉండదు. APFI, i3S కారణంగా ట్రాఫిక్‌లో బండిని రీస్టార్ట్ చేసినప్పుడు స్మూత్‌గా రీస్టార్ట్ అవుతుంది. సిటీ ట్రాఫిక్‌లో తరచూ సిగ్నళ్ల దగ్గర ఆగి మళ్లీ వెళ్లేటప్పుడు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హీరో మోటోకార్ప్ చెబుతోంది.

భద్రతాపరంగా కూడా ఈ బైక్‌లో కొత్త ఫీచర్లను జోడించారు. తొలిసారిగా ఈ సిరీస్‌లో హజార్డ్ లైట్స్‌ను అందించారు. ముందు భాగంలో డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హ్యాండిల్ బార్‌పై ఇంజిన్ కిల్ స్విచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించడం దీని మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు.

డిజిటల్ డిస్‌ప్లేలో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్టు ఉంటుంది. దీనివల్ల ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు, ఫోన్ బ్యాటరీ స్థితి వంటి వివరాలను నేరుగా డిస్‌ప్లేలో చూడవచ్చు. అలాగే రియల్ టైమ్ మైలేజీ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్, యూఎస్‌బీ టైప్ సీ చార్జింగ్ పోర్టు వంటి సౌకర్యాలను కూడా కల్పించారు.

డిజైన్‌పరంగా చూస్తే కొత్త డ్యూయల్ టోన్ గ్రాఫిక్స్, 3D XTEC 2.0 బ్యాడ్జింగ్, డ్యూయల్ టెక్స్చర్ సీటు, స్టైలిష్ స్టిచింగ్, వీల్ రిమ్ టేప్స్‌తో బైక్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గ్లోసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ చెస్ట్‌నట్ బ్రౌన్ అనే ఐదు రంగుల్లో ఈ బైక్ లభిస్తుంది.

అధిక మైలేజీ, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వస్తున్న కొత్త Splender XTEC 2.0 కమ్యూటర్ బైక్ విభాగంలో వినియోగదారులను ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.