బాబోయ్ భారీ కింగ్ కోబ్రా..జనం పరుగో పరుగు

భారీ కింగ్ కోబ్రా గ్రామస్తులను భయపెట్టి పరుగులు పెట్టించింది. నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఒక నివాస ప్రాంతానికి సమీపంలోని పొలం నుంచి ఒక భారీ కింగ్ కోబ్రా(గిరి నాగు) ఇళ్లకు ప్రమాదకరంగా దగ్గరగా రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Jun 21, 2026, 11:36 am IST
Read Time: 3 mins
బాబోయ్ భారీ కింగ్ కోబ్రా..జనం పరుగో పరుగు

విధాత : భారీ కింగ్ కోబ్రా గ్రామస్తులను భయపెట్టి పరుగులు పెట్టించింది. నేపాల్‌లోని రౌతహత్ జిల్లాలో ఒక నివాస ప్రాంతానికి సమీపంలోని పొలం నుంచి ఒక భారీ కింగ్ కోబ్రా(గిరి నాగు) ఇళ్లకు ప్రమాదకరంగా దగ్గరగా రావడంతో  స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పట్టుకోబోయిన స్నేక్ క్యాచర్ మీదకు బుస్సుమంటూ దూసుకురావడం చూసిన జనం భయంతో వెనక్కి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే స్నేక్ క్యాచర్ దీపక్ మాత్రం తన అనుభవాన్ని, నైపుణ్యాన్ని వినియోగించి కింగ్ కోబ్రా వయసు, పొడుగు, పరిమాణం, దాని కదలికలను అంచనా వేస్తూ..చాకచక్యంగా దానిని సంచిలో బంధించాడు. స్నేక్ క్యాచర్ కింగ్ కోబ్రా తోకను పట్టుకోగానే అది బుసలు కొడుతూ అతడి మీదకు దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా పామును వదిలేయగా అది జనం మీదకు వెళ్లడంతో వారు భయాందోళనతో పరుగులు తీశారు.

స్నేక్ క్యాచర్ దీపక్ తిరిగి ఒడుపుగా కింగ్ కోబ్రా తోకను పట్టుకుని దానిని బంధించి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశాడు. కింగ్ కోబ్రా వయసు 12నుంచి 15ఏళ్ల ఉంటుందని స్నేక్ క్యాచర్ దీపక్ అంచనా వేశాడు. ఇంత భారీ పరిమాణంలో ఉన్న కింగ్ కోబ్రాలు వేగంగా పరుగెత్తలేవని, అయితే ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జాతి కింగ్ కోబ్రాకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు.