విధాత: జీసస్ అండతో సముద్రాన్ని చీల్చుతానని ఉత్తర ప్రగల్బాలు పలికి సముద్రంలోకి వెళ్లిన ఓ వ్యక్తి ప్రాణ భయంతో అంతే వేగంతో ఒడ్డుకు పరుగెత్తుకొచ్చిన వీడియో వైరల్ గా మారింది. నైజీరియాలో ఓ పాస్టర్ బైబిల్‌లోని మోసెస్‌లా సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు.
చేతిలో బైబిల్, కర్ర పట్టుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా, అద్భుతం జరుగుతుందని అనుచరులు ఆసక్తిగా గమనించారు. అనుచరులు ఉత్సాహంతో చేతులు పైకెత్తి కేరింతలు కొడుతుండగా పాస్టర్ సముద్రంలోకి వెళ్లాడు. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ అల ఆయనను ముంచెత్తడంతో అతను నీటిలో కొద్దిసేపు మునిగిపోయాడు. దీంతో అది చూస్తున్న వారందరిలో ఆందోళన నెలకొంది.
అదృష్టవశాత్తు ఆ పాస్టర్ తన చేతి కర్రను పైకి లేపుతూ, వేగంగా ఒడ్డుకు చేరుకోవడంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ, దేవుడి పేరుతో ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేయొద్దని, ప్రకృతి శక్తిని తక్కువ అంచనా వేయకూడదని కామెంట్లు చేస్తున్నారు.
నైజీరియాలో ఓ పాస్టర్ బైబిల్‌లోని మోసెస్‌లా సముద్రాన్ని చీల్చాలని ప్రయత్నించి వార్తల్లో నిలిచాడు. చేతిలో బైబిల్, కర్ర పట్టుకుని సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్లగా, అద్భుతం జరుగుతుందని అనుచరులు ఆసక్తిగా గమనించారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ అల ఆయనను ముంచెత్తడంతో కొద్దిసేపు ఆందోళన… pic.twitter.com/kpAsPHen3M
— Telugu Stride (@TeluguStride) June 20, 2026