విధాత : యోగా దినోత్సవంలో ఏనుగుల భాగస్వామ్యంతో కూడిన వీడియో ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్దపార నేషనల్ పార్కులో ప్రకృతి ఒడిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిర్వహించిన యోగా వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పచ్చని అడవి మధ్య, నదీ తీరాన అటవీ శాఖ సిబ్బంది ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఈ ప్రదర్శనలో సిబ్బందితో పాటు మావటిల సమక్షంలో ఏనుగులు కూడా నదిలో నిల్చుని యోగాసనాల ప్రదర్శనను మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
సాధారణంగా ఏనుగులను శక్తివంతమైన, భారీ జంతువులుగా ఊహించుకుంటాం. అదే సమయంలో మానవుని మచ్చికలో మెలగడంలో తెలివైన జంతువు కూడా అన్న సంగతి తెలిసిందే. అడవిలో అటవీ శాఖ సిబ్బంది యోగసనాలు వేస్తుంటే..సమీపంలో నిలబడిన ఏనుగులు అదే వాతావరణంలో ప్రశాంతంగా పాల్గొని.. తమ మావటీల సూచనలను పాటిస్తూ, నెమ్మదిగా తమ భారీ శరీరాలను, చెవులను కదిలిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించాయి.
అడవి మధ్యలో యోగా ప్రదర్శన ప్రత్యేకంగా భావిస్తే..ఇక ఏనుగులు కూడా అందులో చేరినప్పుడు అది మరింత ఆసక్తికరంగా మారిపోయింది. అందుకే ఈ వీడియోను నెటిజన్లు ఇష్టపడుతున్నారు.
14 వేల అడుగుల ఎత్తులో యోగా
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని లేహ్ లడఖ్‌లోని 14,091 అడుగుల ఎత్తులో ఉన్న పాంగాంగ్ త్సో సరస్సు తీరాన ఐటీబీపీ హిమవీరులు యోగా వేడుకలతో ఆకట్టుకున్నారు. గడ్డకట్టే చలిని లెక్కచేయకుండా యోగా సాధనలో పాల్గొన్న జవాన్లు శారీరక దృఢత్వాన్ని చాటిచెప్పారు. మానసిక ప్రశాంతతతో పాటు ప్రకృతితో సామరస్యంగా జీవించే సందేశాన్ని వారు తమ యోగా ప్రదర్శనతో ప్రపంచానికి అందించారు.
Yoga amid the wilderness!
Participants embraced the spirit of wellness and nature with a special yoga session at Jaldapara National Park, blending mindfulness with the serene beauty of one of India’s most iconic wildlife destinations.#InternationalYogaDay #YogaDay… pic.twitter.com/izSE0ByS1i
— Ronak Bhati (@ronak_parihar03) June 21, 2026