Yoga Day | యోగా అంటే ఏమిటి..? ఆ పేరు ఎలా వ‌చ్చింది..? అస‌లు ఏ దేశంలో పుట్టింది..?

Yoga Day | 2015 నుంచి ప్ర‌తి ఏడాది జూన్ 21వ తేదీన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం. జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ యోగా డేలో పాల్గొంటున్నారు. యోగా అంటే ఏమిటి..? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది..? ఏ దేశంలో పుట్టింది..? యోగా వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం.

Yoga Day | యోగా అంటే ఏమిటి..? ఆ పేరు ఎలా వ‌చ్చింది..? అస‌లు ఏ దేశంలో పుట్టింది..?

Yoga Day | 2015 నుంచి ప్ర‌తి ఏడాది జూన్ 21వ తేదీన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్నాం. జూన్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌తి ఒక్క‌రూ యోగా డేలో పాల్గొంటున్నారు. యోగా అంటే ఏమిటి..? దానికి ఆ పేరు ఎలా వ‌చ్చింది..? ఏ దేశంలో పుట్టింది..? యోగా వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు ఏంటో తెలుసుకుందాం.

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సెప్టెంబర్ 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రజారోగ్యానికి అత్యంత అవసరమైన యోగాను అంతర్జాతీయంగా సెలబ్రేట్ చేయాలని ప్రతిపాదించారు. UNGA 69వ సెషన్‌లో మోదీ ప్రసంగిస్తూ.. యోగా మన ప్రాచీన సంప్రదాయం నుంచి మనకు లభించిన అమూల్యమైన కానుక అని చెప్పారు. మనస్సు, శరీరం, ఆలోచన, కార్యాచరణల ఐక్యతను యోగా ప్రతిబింబిస్తుంది. యోగా అనేది ఒక సంపూర్ణ జీవన విధానం. మన ఆరోగ్యానికి, మన శ్రేయస్సుకు యోగా చాలా అవసరమని నొక్కి చెప్పారు. అప్పటి నుంచి జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తున్నారు. ప్రపంచ యోగా దినోత్సవం ప్రతిపాదనను దాదాపు 175 సభ్య దేశాలను ఆమోదించాయి.

జూన్ 21నే ఎందుకు..?

జూన్ 21వ తేదీనే అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ఎందుకు జ‌రుపుకోవాలి అనే సందేహం అంద‌రికి రావొచ్చు. దీనికి ఒక కార‌ణం కూడా ఉంది. ఈరోజు ఉత్తరార్థగోళంలో అత్యధిక పగటి సమయం ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉండటంతో ఈ రోజును యోగా డేగా జరుపుకోవడం 2015 జూన్ 21నుంచి షురూ అయ్యింది.

యోగా ఎక్క‌డ పుట్టింది..? అర్థ‌మేంటి..?

యోగా ఇండియాలోనే పుట్టింది. యోగా అనే పదం సంస్కృత నుంచి పుట్టింది. వాస్తవానికి యోగాను అప్పట్లో ‘యుజ్’ అనేవారు. అది క్రమేనా యోగాగా మారింది. ‘యుజ్’ అంటే ఏకం చేయడం లేదా ఒక దగ్గరకు చేర్చడం అని అర్థం. అంటే మనసు, శరీరాన్ని ఏకం చేసి ఆరోగ్యాన్ని అందించే సాధనం. యోగాను ఆ సాక్షాత్తు ఆ ఆదియోగి (శివుడు) ప్రారంభించారని, అందుకే ఆ పేరు వచ్చిందని కూడా అంటారు. ఏది ఏమైనా యోగా ఒక మంచి వ్యాయామం. బరువులు ఎత్తక్కర్లేదు.. పరుగులు పెట్టక్కర్లేదు. వివిధ సులవైన ఆసనాలతో ఆరోగ్యాన్ని అందిపుచ్చుకోవచ్చు.

యోగా.. శ్వాస‌క్రియ‌పై ధ్యాస ఉంచ‌డ‌మే..!

ఇంద్రియాలను వశపరుచుకుని, చిత్తముని ఈశ్వరుడి మీదకు మళ్లించడమే యోగా. ఇలా ఏకాగ్రత సాధించి పరమార్థ తత్వమునకు వెళ్లడమే యోగ. యోగా అంటే సాధనా అని అర్థం. యోగాలో చాలా ఆసనాలు, సాధనాలు ఉన్నాయి. వీటన్నింటినీ చేసేటప్పుడు పాటించే ఏకైక సూత్రం శ్వాస క్రియపై ధ్యాస ఉంచడం. ఇలా చేస్తే శ్వాసక్రియలోని ఇబ్బందులు దూరం అవుతాయి. శరీరంలో హార్మోన్స్ విడుదలై శరీరంతో పాటు మనస్సు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మానసిక సమస్యలు కూడా దూరం అవుతాయి.

యోగాకు ఉన్న ప్రాముఖ్య‌త ఏంటి..?

యోగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని, దీన్ని జీవనశైలిలో భాగం చేసుకోవాలని ప్రపంచానికి చెప్పడమే ఈ అంతర్జీతయ యోగా దినోత్సవం ఉద్దేశం. యోగా శారీరక శక్తిని, మనసుకు ప్రశాంతతను రేకెత్తించే స్థానాలపై ఉంది. ఒకప్పుడు యోగాలో ఫిట్‌నెస్‌కు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. యోగాకు బదులుగా మానసిక స్పష్టతను పెంపొందించడం, ఆధ్యాత్మిక శక్తిని మెరుగుపరచడానికి ప్రాధాన్యత ఉండేది. కానీ, దానివల్ల కలిగే సత్ఫలితాలను చూసి.. ఫిట్‌నెస్‌లో యోగాను భాగం చేశారు.