Social Media Ban | 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌మీడియాపై నిషేధం.. నిజంగా బ్యాన్ సాధ్యమవుతుందా? ఈ సవాళ్లను ఎలా అధిగమిస్తారు?
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా బ్యాన్ విధించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ.. అమలులో అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Social Media Ban | చిన్నారులపై స్మార్ట్‌ఫోన్, సోషల్‌మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వాడకుండా బ్యాన్ విధించాలని నిర్ణయించింది. ఇవాళ కర్ణాటక అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.
పిల్లలు, టీనేజర్లపై సోషల్‌మీడియా దుష్ప్రభావం చూపిస్తుందని.. మొబైల్ వాడకం వల్ల పిల్లల్లో ప్రతికూల ప్రభావాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అసెంబ్లీలో సిద్ధరామయ్య తెలిపారు. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా ఉపయోగించకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సిద్ధరామయ్య ప్రకటనతో దేశంలో16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇక సోషల్‌మీడియా బ్యాన్ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే ఏపీ, గోవా రాష్ట్రాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇతర దేశాల్లోనూ..
పిల్లలు సోషల్‌మీడియా వినియోగించకుండా ఇప్పటికే పలు దేశాలు చర్యలు తీసుకున్నాయి. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా ఇప్పటికే నిషేధం విధించింది. ఇతర దేశాలు కూడా యువతపై సోషల్‌మీడియా వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి చర్యలు చేపట్టాయి. తాజాగా భారత్‌లో కర్ణాటక సైతం బ్యాన్ విధించింది.
ఆచరణలో సవాళ్లెన్నో..
16 లోపు పిల్లలు సోషల్‌మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.. కానీ దాన్ని ఎలా అమలు చేస్తుందన్న వివరాలను మాత్రం వెల్లడించలేదు. దీంతో దీని అమలులో ఉన్న అనేక సాంకేతిక సవాళ్లు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. పిల్లల వయసు ఎలా నిర్ధారిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ అసలైన వయసు చెబుతారనే గ్యారంటీ లేదు కాబట్టి అకౌంట్ క్రియేట్ చేసుకునేప్పుడు ఏజ్ వెరిఫికేషన్ కోసం పలు మార్పులు చేయాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తప్పుడు వివరాలతో అకౌంట్లు క్రియేట్ తెరవకుండా ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు. అలాగే vpn వాడి లొకేషన్ మార్చి యాక్సెస్ చేసే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Realme | రేపే మార్కెట్‌లోకి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. చీప్ అండ్ బెస్ట్ మొబైల్ కొనాలని చూసేవాళ్లకు బెస్ట్ ఆప్షన్!
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై సరికొత్త చర్చ.. నందమూరి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram