Cervical Cancer | ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ మ‌హిళను బ‌లితీసుకుంటోన్న స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్‌

మ‌న దేశంలోని మ‌హిళ‌ల్లో అత్య‌ధికంగా క‌నిపించే క్యాన్స‌ర్ల‌లో గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార‌ క్యాన్స‌ర్ (Cervical Cancer) రెండో స్థానంలో ఉంది. దేశంలో (India) ప్రతి సంవత్సరం దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్స‌ర్ కార‌ణంగా ఏటా దాదాపు 42 వేల కంటే ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు మ‌ర‌ణిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్ర‌తి ఎనిమిది నిమిషాల‌కు ఓ మ‌హిళ చ‌నిపోతోంది (One woman dies every 8 minutes).

Cervical Cancer | ప్ర‌తి 8 నిమిషాల‌కు ఓ మ‌హిళను బ‌లితీసుకుంటోన్న స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్‌

Cervical Cancer | మహిళలను క్యాన్సర్ (Cancer) ముప్పు వెంటాడుతోంది. ఒకప్పుడు రొమ్ము క్యాన్సర్‌ లాంటివి ఉంటే.. ఇప్పుడు గర్భాశయ ముఖద్వార (Cervical Cancer) క్యాన్సర్‌ భయపెడుతోంది. మ‌న దేశంలోని మ‌హిళ‌ల్లో అత్య‌ధికంగా క‌నిపించే క్యాన్స‌ర్ల‌లో గ‌ర్భాశ‌య ముఖ‌ద్వార‌ క్యాన్స‌ర్ రెండో స్థానంలో ఉంది. దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 80,000 కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్యాన్స‌ర్ కార‌ణంగా ఏటా దాదాపు 42 వేల కంటే ఎక్కువ మంది మ‌హిళ‌ల‌కు మ‌ర‌ణిస్తున్న‌ట్లు గ‌ణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు ప్ర‌తి ఎనిమిది నిమిషాల‌కు ఓ మ‌హిళ చ‌నిపోతోంది.

మూడోస్థానంలో భార‌త్‌..

ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన క్యాన్సర్ కేసుల్లో చైనా, అమెరికా తర్వాత భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. సంవత్సరానికి సుమారు 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇందులో దాదాపు 15 లక్షల కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. 2040 నాటికి భారత్‌లో క్యాన్సర్ కేసులు ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా.

14 ఏళ్లు పైబ‌డిన బాలిక‌ల‌కు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌..

అందుకే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ని అరికట్టేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందులో భాగంగానే హెచ్‌పీవీ (HPV) వ్యాక్సిన్‌ని దేశవ్యాప్తంగా అందించాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో 14 ఏళ్ల పైబడిన అమ్మాయిలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారని కేంద్ర ఆరోగ్యశాఖ అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల ద్వారా గార్డాసిల్ (Gardasil) టీకా ఇవ్వనున్నారు.

నాలుగు ర‌కాల వైర‌స్‌ల‌కు ర‌క్ష‌ణ‌..

ఈ వ్యాక్సిన్‌ నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌లను నిరోధిస్తుంది. ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్‌ 16, 18 తోపాటు టైప్‌ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. ఒక డోసుతో బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. 15ఏళ్ల లోపు బాలికల కోసం గార్డాసిల్‌-4 టీకా ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ టీకా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఒక్కో డోసు ధ‌ర రూ.3,927గా ఉంది. అదే 15 ఏళ్లు పైబ‌డిన బాలిక‌లు మాత్రం మూడు డోసుల్లో ఈ టీకాను తీసుకోవాల్సి ఉంటుంది.

ఇప్ప‌టికే 160 దేశాల్లో టీకా పంపిణీ

ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉంది. వీటిలో 90 దేశాలు సింగిల్‌ డోసులో అందిస్తున్నాయి. ఈ టీకా వ‌ల్ల అనేక దేశాల్లో స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్లు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు నివేదిక‌లు సూచిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి :

Numaish Exhibition| నుమాయిష్ ఎగ్జిబిషన్.. పోకిరీల ఆటకట్టించిన షీటీమ్స్
Donald Trump| అపరేషన్ సిందూర్ ఆపకపోతే..పాక్ ప్రధాని చచ్చేవారు : ట్రంప్ కీలక వ్యాఖ్యలు