Numaish Exhibition| నుమాయిష్ ఎగ్జిబిషన్.. పోకిరీల ఆటకట్టించిన షీటీమ్స్

హైద‌రాబాద్ లోని నాంప‌ల్లిలో జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వ‌హించిన 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌ లో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన 264 మంది పోకిరీలను గుర్తించి అదుపులో తీసుకున్న షీ టీమ్ పోలీస్ బృందం ప్రకటించింది.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Feb 25, 2026, 11:36 am IST
Read Time: 3 mins
Numaish Exhibition| నుమాయిష్ ఎగ్జిబిషన్.. పోకిరీల ఆటకట్టించిన షీటీమ్స్

విధాత, హైదరాబాద్ : హైద‌రాబాద్ లోని నాంప‌ల్లిలో జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వ‌హించిన 85వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ‘నుమాయిష్‌ లో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించిన 264 మంది పోకిరీలను గుర్తించి అదుపులో తీసుకున్న షీ టీమ్ పోలీస్ బృందం ప్రకటించింది. నుమాయిష్ సందర్శన పేరుతో మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను తాకుతూ వేధించేందుకే వచ్చామన్నట్లుగా ప్రవర్తించిన పోకిరీలను ప‌ట్టుకునేందుకు షీ టీమ్స్ పోలీసులు సంద‌ర్శ‌కుల్లో క‌లిసిపోయి నిఘా పెట్టారు.

నాంపల్లి ఎగ్జిబిషన్‌ కొనసాగినన్ని రోజులు సాగించిన నిఘాలో 264 మంది పోకిరిలను షీటీమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై కేసులు నమోదు చేయగా, 52 మందికి రూ.1050 కోర్టు జరిమానా విధించబడింది. నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి వార్నింగ్ తో వదిలేసినట్లుగా షీటీమ్ విభాగం పేర్కొంది.

జనవరి1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ విజయవంతంగా కొనసాగింది. దేశ నలుమూలల నుంచి రకరకాల సంప్రదాయాలకు చెందిన కళాకృతులు ఇక్కడ కొలువు దీరాయి. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా, మైక్రో ఇండస్ట్రీలకు సంబంధించిన ఉత్పత్తుల స్టాల్స్ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన హస్తకళలు, దుస్తులు, కళాకృతుల ఉత్పత్తులకు చెందిన 1050 స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.