Jaldapara | ఈస్ట్ వీరప్పన్.. కరుడుగట్టిన వేటగాడి కథ తెలుసా?
అప్పట్లో వీరప్పన్.. అనే పేరు చెప్పగానే వెన్నులో వణుకుపుట్టేది. కరుడుగట్టిన బందిపోటుగా దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. అస్సాంకు చెందిన కరుడుగట్టిన వన్యప్రాణుల వేటగాడు రికోచ్ నర్జారీ క్రూరమైన, ఆధునిక వేట టెక్నిక్ ఉపయోగించడం వల్ల అతనిని ‘ఈస్ట్ వీరప్పన్’ గా పిలుస్తారు.
అప్పట్లో వీరప్పన్.. అనే పేరు చెప్పగానే వెన్నులో వణుకుపుట్టేది. కరుడుగట్టిన బందిపోటుగా దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. గంధపు చెక్కులు, ఏనుగు దంతాలు, ఇలా అనేక జంతువులను చంపి దేశవిదేశాలకు స్మగ్లింగ్ చేసేవాడు. 2004లో పోలీస్ ఎన్కౌంటర్లో వీరప్పన్ హతమయ్యాడు. అస్సాంకు చెందిన కరుడుగట్టిన వన్యప్రాణుల వేటగాడు రికోచ్ నర్జారీ క్రూరమైన, ఆధునిక వేట టెక్నిక్ ఉపయోగించడం వల్ల అతనిని ‘ఈస్ట్ వీరప్పన్’ గా పిలుస్తారు. కాగా, నర్జారీ.. వీరప్పన్ లాగా కాకుండా టెక్నాలజీని ఉపయోగించి వన్యప్రాణులను చంపేవాడు. అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్లు ఉపయోగించి స్మగ్లింగ్ చేసేవాడు. ఇలా వందలాది ఖడ్గమృగాలను వేటాడి వాటి కొమ్ములను స్మగ్లింగ్ చేసేవాడు.
వేటకు మిలిటరీ గ్రేడ్ ట్రాంక్విటైజర్ల ఉపయోగం..
నర్జారి గ్యాంగ్ మిలిటరీ గ్రేడ్ ట్రాంక్విలైజర్లు, అత్యాధునిక రైఫిల్స్‌ను ఉపయోగించి రాత్రివేళల్లో వేటాడేవారు. అయితే, రైనోస్ ను చంపిన తరువాత వాటి శరీరాలు కుళ్లిపోయిన స్థితిలో మాత్రమే కనిపించేవి. ఖడ్గమృగాల కొమ్ములను అత్యంత సమర్థవంతమైన పరికరాలతో వేరుచేసేవారు. ఇతర వేటగాళ్ల మాదిరిగా ఎలాంటి గుర్తులను వదిలిపెట్టకుండా జాగ్రత్తపడేవారు. అలాగే, నర్జారీని ఎలా ఉంటాడో తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉండడంతో అతడిని పట్టుకోవడానికి పోలీసులకు కష్టంగా ఉండేది. అటవీ అధికారులకు తెలియని దారులు కనిపెడుతూ పోలీసుల నుంచి తప్పించుకునేవాడు. అయితే, పశ్చిమబెంగాల్ కేడర్‌కు చెందిన IFS అధికారి పర్వీన్ కస్వాన్. జాల్దాపారా డీఎఫ్ఓగా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు చేపట్టిన వెంటనే నర్జారీని పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని అనేక ఆపరేషన్లు నిర్వహించి అతడి ముఠాను పట్టుకున్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా నర్జారీని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
విద్యావంతుడైన వేటగాడు..
జాల్దాపారా నేషనల్ పార్క్‌లో ఖడ్గమృగ వేటగాడు రికోచ్ నర్జారిని పట్టుకోవడం ఒక బాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించే సినిమా రేంజ్ లో ఉంది. నర్జారీ విద్యావంతుడు.. కనీసం ఐదు భాషలు మాట్లాడగలడు. ఇతనికి మరో ట్యాలెంట్ ఏంటంటే చిరునవ్వుతో మాట్లాడి ఎలాంటి వారినైనా ఆకర్షించి తన వేటలో భాగస్వామ్యం చేసేవాడు. పేదలను టార్గెట్ చేస్తూ వారిని ఆర్థికంగా ఆదుకుంటానని రాబిన్ హుడ్ స్టైల్లో గ్యాంగ్ ను మెయింటేన్ చేసేవాడు నర్జారీ. పూర్తిగా పాతకాలపు పద్ధతులను వదిలి సైలెన్సర్ గన్లు, డ్రోన్స్, గెరిల్లా స్ట్రాటజీలు, సైలెన్స్ దాడులు ఈ వేటగాడి హంటింగ్ టెక్నిక్. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్‌లో చురుగ్గా పనిచేసిన మాజీ మిలిటెంట్లను ఎంపిక చేసుకుని తన బృందంగా మార్చుకున్నాడు. అడవుల్లో ట్రాకర్లు ఏర్పాటు చేసి రోజల తరబడి ప్లాన్ చేసేవారు. సరైన సమయాన్ని చూసి వేటకు వెళ్లేవారు. నర్జారీ గ్యాంగ్ లో షార్ప్ షూటర్లు, వేట తరువాత కొమ్ములను తరలించే ట్రాన్స్‌పోర్టర్స్ ఉండేవారు. పని పూర్తి చేసిన వెంటనే ఎలాంటి ఆధారాలు మిగుల్చకుండా జాగ్రత్తపడి వేటాడేది.
జల్దపారా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్‌లోని టోర్సా నది వెంబడి తూర్పు హిమాలయాల దిగువన ఖడ్గమృగాలకు కేంద్ర బిందువుగా ఉంది. నదీతీర అడవులతో కూడిన ఈ విస్తారమైన గడ్డి భూములను 1943లో అభయారణ్యంగా ఏర్పాటు చేశారు. 2012 లో ఈ అభయారణ్యం స్థితిని జాతీయ ఉద్యానవనంగా మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. అటవీశాఖ రికార్డుల ప్రకారం 217 చదరపు కిలోమీటర్ల పార్క్ పరిధిలో 1966-67లో 76 ఖడ్గమృగాలు ఉండగా, 1980 నాటికి సంఖ్య 14కి పడిపోయింది. జల్దపారాకు టోర్సా, మలంగి, హోల్లాంగ్, చిరఖావా, కలిఝోరా, సిస్సామారా, భాలుకా మరియు బురి టోర్సా వంటి అనేక నదులు సరిహద్దులుగా ఉన్నాయి. ఇవి వివిధ రకాల క్షీరదాలు, ఉభయచరాలు, సరీసృపాలు.. పక్షులకు స్వర్గధామంగా ఉండే విస్తృతమైన గడ్డి భూములు ఉన్నాయి.
Also Read –Vattinagulapally Land Grab Row | తెలంగాణ నంబర్ టూ మంత్రి కుమారుడి భూ కబ్జా కత!
CM Revanthreddy | త్వరలో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి
TG | దేశంలో తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణాలో.. ఎక్కడంటే?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram