CM Revanthreddy | త్వరలో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.

CM Revanthreddy | త్వరలో 40వేల ఉద్యోగాలను భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :

సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రూ.262 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కరీంనగర్ ప్రజలు కీలక పాత్ర పోషించారన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కరీంనగర్ వేదికగా సోనియమ్మ మాట ఇచ్చి నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. ‘‘డిసెంబర్ 3న ప్రత్యేకత ఉంది. మీ ఓటును ఆయుధంగా మార్చి దుర్మార్గ పాలనను అంతమొందించి ప్రజా పాలనను తీసుకొచ్చారు.

ఈ రోజే తెలంగాణ కోసం శ్రీకాంత చారి అమరుడయ్యారు. శ్రీకాంతాచారి ఆశయ సాధనలో భాగంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. రెండున్నరేళ్లు పూర్తి చేసుకునే లోగా మరో 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. బీఆరెస్ పాలనలో లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయింది. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రైతులకు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేశాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 లక్ష 4 వేల కోట్లు రైతుల కోసం ఖర్చు చేశాం. రూ. 8 వేల కోట్లు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఖర్చు చేశాం.

ఆడబిడ్డలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశాం. దాదాపు 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు హుస్నాబాద్ కు సాగునీరు అందించే గండిపెల్లి, గౌరెల్లి ప్రాజక్టులను పూర్తి చేయలేదు. గత పాలకులు ప్రచారం మొదలు పెట్టేందుకు సెంటిమెంట్ గా హుస్నాబాద్ ను ఉపయోగించుకున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లను అభివృద్ధి చేసుకున్నారు.. కానీ హుస్నాబాద్ ను అభివృద్ధి చేయలేదు.

గత పాలకుల్లా మేం హుస్నాబాద్ ను నిర్లక్ష్యం చేయం. ఎన్ని నిధులైనా ఖర్చు చేసి హుస్నాబాద్ ను అభివృద్ధి చేస్తాం. గత పదేళ్లలో బీఆరెస్ పేదలకు ఒక్క డబుల్ బెడ్రూం ఇవ్వలేదు. పదేళ్లు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. పదేళ్లలో రాష్ట్రంలో 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు వెలుగులు నింపుతాయి. సర్పంచ్ ఎన్నికల్లో మంచివాళ్లని ఎన్నుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేసే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు, వివేక్ వెంకట స్వామి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Also Read –
Mushroom Business | ఆ దంప‌తుల జీవితాన్ని మార్చేసిన పుట్ట‌గొడుగుల వ్యాపారం.. ఏడాదికి రూ. 24 ల‌క్ష‌ల సంపాద‌న‌..!
Kishanreddy | రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి.. కిషన్‌రెడ్డి డిమాండ్
ఓటీటీని షేక్ చేస్తున్న మ‌గ‌వాళ్ల‌ సినిమా