OTT Movies | మార్చి తొలి వారం ఓటీటీ సంబరం .. థ్రిల్లర్లు, ఎమోషనల్ డ్రామాలుతో కళకళలాడ‌నున్న డిజిట‌ల్ వేదిక‌

OTT Movies | ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలలు పూర్తై మార్చి నెల మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతుండగా, ఓటీటీ వేదికలు కూడా వినోదంతో సందడి చేస్తున్నాయి.

  • By: sn |    movies |    Published on : Mar 04, 2026 7:48 AM IST
OTT Movies | మార్చి తొలి వారం ఓటీటీ సంబరం .. థ్రిల్లర్లు, ఎమోషనల్ డ్రామాలుతో కళకళలాడ‌నున్న డిజిట‌ల్ వేదిక‌

OTT Movies | ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు నెలలు పూర్తై మార్చి నెల మొదలైంది. థియేటర్లలో కొత్త సినిమాలు వరుసగా విడుదలవుతుండగా, ఓటీటీ వేదికలు కూడా వినోదంతో సందడి చేస్తున్నాయి. భారీ చిత్రాల నుంచి చిన్న కాన్సెప్ట్ మూవీస్ వరకు ప్రతి వారం కొత్త కంటెంట్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. ముఖ్యంగా థియేటర్‌కు వెళ్లలేని వారికి ఓటీటీలు ప్రధాన వినోద కేంద్రాలుగా మారాయి. జనవరి, ఫిబ్రవరి మాదిరిగానే మార్చిలోనూ అదే జోరు కొనసాగుతోంది.

ఈ వారం వివిధ డిజిటల్ వేదికలపై 13కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. థ్రిల్లర్‌లు, యాక్షన్ డ్రామాలు, ఎమోషనల్ కథలు, ప్రేరణాత్మక వెబ్ సిరీస్‌లు ఇలా విభిన్న జానర్లతో కంటెంట్ ప్రేక్షకులను అలరించనుంది.

నెట్‌ఫ్లిక్స్ వేదికగా మార్చి 6న పలు చిత్రాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. తెలుగు డబ్బింగ్ చిత్రం ‘విత్ లవ్‌’, హిందీ సిరీస్ ‘హలో బచ్చోన్’, ఇంగ్లీష్ మూవీ ‘వార్ మెషీన్’ స్ట్రీమింగ్ కానున్నాయి. ముఖ్యంగా ‘హలో బచ్చోన్’ విద్యా వ్యవస్థలోని ఒత్తిడులు, తల్లిదండ్రుల అంచనాలు, విద్యార్థుల కలల మధ్య జరిగే సంఘర్షణను చూపించే కథగా ఆసక్తి రేపుతోంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో కూడా మంచి సినిమాలు సంద‌డి చేస్తున్నాయి. మార్చి 3న హిందీ చిత్రం ‘తన్వి ద గ్రేట్’, మార్చి 4న ఇంగ్లీష్ సిరీస్ ‘యంగ్ షెర్లాక్’, మార్చి 5న హిందీ మూవీ ‘సుబేదార్’ స్ట్రీమింగ్ కానున్నాయి. విభిన్న వయస్సుల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఈ కంటెంట్ రూపొందింది.

జియో హాట్ స్టార్ వేదికగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘విక్రమ్ ఆన్ డ్యూటీ’ మార్చి 6 నుంచి ప్రసారం కానుంది. పోలీస్ అధికారి విక్రమ్ ఒక క్లిష్టమైన కేసును చిన్న చిన్న ఆధారాలతో ఎలా ఛేదిస్తాడనే అంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది.

ఆహా లో తెలుగు చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ మార్చి 4న స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండే కథ కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి.

సోని లివ్‌ లో హిందీ మూవీ ‘లాలో కృష్ణ సదా సహాయతే’ మార్చి 6న విడుదల కానుంది. అదే రోజు Sun NXT లో తమిళ చిత్రాలు ‘డియర్ రథి’, ‘గ్రానీ’ స్ట్రీమింగ్ కానున్నాయి.

ఇక జీ5 వేదికగా తెలుగు డబ్బింగ్ చిత్రం ‘గాంధీ టాక్స్’, హిందీ మూవీ ‘జబ్ కూలీ కితాబ్’ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

మొత్తంగా చూస్తే, మార్చి తొలి వారం ఓటీటీలు అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని బలమైన కంటెంట్‌తో సిద్ధమయ్యాయి. థ్రిల్ కోరుకునే వారికి, భావోద్వేగ కథలు ఇష్టపడేవారికి, అలాగే విద్యాపరమైన ప్రేరణాత్మక కథల కోసం ఎదురుచూసేవారికి ఈ వారం మంచి వినోదాల‌ విందుగా నిలవనుంది. సినీప్రియులు తమకు నచ్చిన జానర్ ఎంచుకుని డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించవచ్చు.