OTT Movies | ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర… ఏకంగా 30 సినిమాలు, సిరీస్‌లు రిలీజ్
OTT Movies | ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం భారీ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ సిద్ధంగా ఉంది. మే 18 నుంచి మే 24 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి.
OTT Movies | ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం భారీ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ సిద్ధంగా ఉంది. మే 18 నుంచి మే 24 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఏకంగా 30 సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. హారర్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, స్పోర్ట్స్ డాక్యుమెంటరీలు ఇలా అన్ని జోనర్లలో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కంటెంట్ సిద్ధమైంది.
ఈ వారం విడుదలల్లో ప్రత్యేకంగా హాలీవుడ్ హారర్ చిత్రాలు, యాక్షన్ థ్రిల్లర్లు, కొన్ని ఆసక్తికర తెలుగు కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ ఒక్క ప్లాట్‌ఫారమ్‌లోనే అత్యధికంగా 12 కొత్త సినిమాలు, సిరీస్‌లను విడుదల చేయడం విశేషం.
నెట్‌ఫ్లిక్స్‌లో హారర్, డాక్యుమెంటరీలు స్పెషల్
నెట్‌ఫ్లిక్స్‌లో ఈసారి పలు విభిన్న కథాంశాలతో కూడిన కంటెంట్ అందుబాటులోకి రానుంది. ది బోరోగ్స్ అనే సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్‌తో పాటు దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్ అనే జాంబీ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అలాగే లేడీస్ ఫస్ట్, గోట్, దేసి బ్లింగ్ వంటి కంటెంట్ కూడా వినోదాన్ని అందించనున్నాయి.
అమెజాన్ ప్రైమ్‌లో యాక్షన్, హారర్ మిక్స్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో లీ క్రోనిన్స్ ది మమ్మీ అనే హారర్ థ్రిల్లర్, టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్ అనే స్పై యాక్షన్ చిత్రం హైలైట్‌గా నిలుస్తున్నాయి. అలాగే సిస్టమ్ అనే కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకులకు కేవలం నాలుగు ఆసక్తికర రిలీజ్‌లు
ఈ వారం తెలుగులో విడుదల కానున్న కంటెంట్‌లో ఆసక్తికరంగా కనిపిస్తున్నవి చాలా తక్కువే. మేము కాప్‌లం, ఉత్తుత్త హీరోలు, సతీ లీలావతి వంటి చిత్రాలు, సిరీస్‌లు తెలుగు ప్రేక్షకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ప్రత్యేకంగా చూడదగ్గ 17 సినిమాలు
ది బోరోగ్స్
లీ క్రోనిన్స్ ది మమ్మీ
సతన్ ది డార్క్
టామ్ క్లేన్సీ జాక్ ర్యాన్: ఘోస్ట్ వార్
సిస్టమ్
సత్రంగి: బదలే కా ఖేల్
వారెంట్ ఫ్రమ్ ది వరల్జ్ ఆఫ్ విళంగు
పండా ప్లాన్: ది మ్యాజికల్ ట్రైబ్
మేము కాప్‌లం
ఉత్తుత్త హీరోలు
బిష్మార్
దిస్ ఈజ్ నాట్ ఏ టెస్ట్
వంటి సినిమాలు ప్రధానంగా నిలుస్తున్నాయి.
హారర్ ప్రేమికుల నుంచి యాక్షన్ అభిమానుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ వారం ఓటీటీలో ఏదో ఒకటి దొరికేలా భారీ లైనప్ సిద్ధమైంది. వీకెండ్‌లో ఏం చూడాలా అని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి ఎంపికగా మారనుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram