మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి

ఆంధ్రప్రదేశ్ తాజాగా కరోనాతో నలుగురు చనిపోవడం ఆందోళన కరంగా మారింది. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 339 కేసులు నమోదు కాగా..ఏపీలో జూన్ 26 నుండి జూలై 16వ తేదీ మధ్యలో 13 కోవిడ్–19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు.

Reported by: Y.V. Narsimha Reddy | ఆంధ్ర ప్రదేశ్ | Jul 17, 2026, 12:37 pm IST
Read Time: 3 mins
మళ్లీ కరోనా వైరస్..ఏపీలో నలుగురి మృతి

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ మరోసారి భారత్ లో వెలుగుచూస్తుండటం జనాలను కలవరపెడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తాజాగా కరోనాతో నలుగురు చనిపోవడం ఆందోళన కరంగా మారింది. దేశ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 339 కేసులు నమోదు కాగా..ఏపీలో జూన్ 26 నుండి జూలై 16వ తేదీ మధ్యలో 13 కోవిడ్–19 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ తో నలుగురు మృతి చెందారు. వారంతా కరోనాతోపాటు.. పలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బాధితుల్లో ముగ్గురు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉండగా, ఇతరులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.

వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం ఐదు నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విస్తరణ నేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కరోనా వైరస్ నియంత్రణపై జిల్లా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఏపీలోని కడప జిల్లాలో–8, గుంటూరు–3, విశాఖపట్నం–1, కాకినాడ–1 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 339 కేసులు నమోదవ్వగా..వాటిలో కేరళ–115, కర్ణాటక–64, మహారాష్ట్ర–43, తమిళనాడు–39, అండమాన్ నికోబార్–18, ఢిల్లీ–18, రాజస్థాన్–12 కేసులు నమోదయ్యాయి.