Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్..! అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నట్లేనా..?
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైట్ హౌస్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన యునిడోస్ యూఎస్ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం లాస్ వెగాస్‌లో జరిగిన కార్యక్రమానికి బైడెన్ హాజరుకాలేదు.

Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైట్ హౌస్ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రసారమైన యునిడోస్ యూఎస్ వార్షిక కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబర్ ఎన్నికల సందర్భంగా బుధవారం మధ్యాహ్నం లాస్ వెగాస్‌లో జరిగిన కార్యక్రమానికి బైడెన్ హాజరుకాలేదు. యునిడోస్ యుఎస్ ప్రెసిడెంట్, సీఈవో జానెట్ ముర్గుయా మాట్లాడుతూ బిడెన్ కరోనా బారిన పడ్డారని, దాంతో కాన్ఫరెన్స్‌కు హాజరు కాలేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం ఖరారైనట్లేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకుంటే గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తనను చుట్టుముడితే ఎన్నికల బరి నుంచి తప్పకుంటానని.. లేకపోతే బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఆయనకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. లాస్ వేగాస్‌లో పలు ఎన్నికల సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా.. తొలి సమావేశంలోనే కొవిడ్ పాజిటివ్‌గా తేలవడంతో సెల్ఫ్ ఐసోలేషన్ కోసం డెలావేర్‌లోని తన బీచ్ హౌస్‌కు వెళ్లారు. బైడెన్ కొవిడ్ పాజిటివ్‌గా తేలడంపై శ్వేత సౌధం ప్రకటన చేసింది. అధ్యక్షుడు జలుబు, దగ్గు, ఇతర సాధారణ రోగ లక్షణాలతో బాధపడుతున్నారని పేర్కొంది. కొవిడ్‌కు సంబంధించి పాక్స్‌లోవిడ్ మందు వాడుతున్నారని, ఇప్పటికే తొలి డోసు తీసుకున్నారని వెల్లడించింది. శ్వాసరేటు, ఊపిరి తీసుకునే రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు అన్నీ సాధారణ స్థాయిలో ఉన్నాయని చెప్పింది.
ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో తొలి టీవీ చర్చ సందర్భంగా బైడెన్ తన ప్రసంగం గుర్తు చేసుకోలేక తడబడి, పొరబడి చిక్కుల్లో పడ్డారు. ఆయన పరిస్థితిని చూసిన సొంత పార్టీ నేతలు ఎన్నికల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అయితే, తాను బాగానే ఉన్నానని.. రేసులో కొనసాగుతానని బైడెన్ చెప్పినా ఆందోళనలు మాత్రం ఆగడం లేదు. కాలిఫోర్నియాకు చెందిన కీలక డెమోక్రటిక్ పార్టీ నేత, ప్రతినిధుల సభ్యుడు ఆడమ్ షిఫ్ సైతం ఎన్నికల నుంచి బైడెన్ తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బైడెన్ రాజకీయ ప్రస్థానం ముగింపునకు వచ్చిందన్న కామెంట్స్ మరింతగా బలాన్ని ఇచ్చాయి. మరోవైపు, హత్యాయత్నం నుంచి బయటపడ్డాక ట్రంప్ విజయావకాశాలు మరింత పెరిగాయని పలు సర్వే నివేదికలు పేర్కొన్నాయి.