TVK Vijay : టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్‌కి భార్య మరో షాక్!

తమిళ హీరో, టీవీకే అధినేత విజయ్‌పై భార్య సంగీత మరో పిటిషన్ దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు.

TVK Vijay : టీవీకే అధినేత, తమిళ్ హీరో విజయ్‌కి భార్య మరో షాక్!

విధాత : త్వరలో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సాధనే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశంతో దూసుకపోతున్న తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధినేత, తమిళ్ హీరో విజయ్‌కి భార్య సంగీత మరో షాక్ ఇచ్చింది. నటి త్రిషతో సన్నిహితంగా ఉంటూ.. నా పిల్లలకు, నాకు అన్యాయం చేస్తున్నారంటూ విజయ్ పై
ఇటీవల చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన సంగీత ..శనివారం ఇదే అంశంపై మరో పిటిషన్ దాఖలు చేసిన

తమ విడాకుల కేసు ముగిసే వరకు..నన్ను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతి ఇవ్వాలంటూ సంగీత తన పిటిషన్ లో కోర్టును కోరింది. చెన్నై నీలంగరైలోని ఇంట్లో తనకు సగం వాటా ఉందని సంగీత పిటిషన్ లో పేర్కొంది.

ఓ వైపు ఫ్యామిలీ కోర్టులో తనపై భార్య విజయ్ కేసు వేయడంతో రాజకీయంగాను, వ్యక్తిగతంగానూ ఇరకాటంలో పడిన విజయ్..తాజాగా నటి త్రిషతో కలిసి ఒకే కారులో ప్రయాణించడం, రిసెప్షన్ కి అటెంట్ అవ్వడం తమిళ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. చెన్నైలో ప్రముఖ సినీ నిర్మాత కల్పతి ఎస్. సురేష్ – మీనాక్షి సురేష్ కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్ కు ఒకే కారులో విజయ్ – త్రిష కలిసిరావడం చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి ఒకే కారులో రావడం, సంప్రదాయ దుస్తుల్లో జంటగా వేదికపైకి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించడం ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంపై రచ్చ కొనసాగుతుండగానే…విజయ్ భార్య సంగీత మా విడాకుల కేసు తేలేవరకు అతని ఇంట్లో ఉండేందుకు అనుమతించాలంటూ కోర్టును ఆశ్రయించడం విశేషం.

ఇవి కూడా చదవండి :

Sand Dredging | కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్
Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు