టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా

టీవీకే చీఫ్ విజయ్, భార్య సంగీత విడాకుల కేసును చెంగల్పట్టు కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది.

టీవీకే చీఫ్ విజయ్ విడాకుల కేసు వాయిదా

విధాత : సినీ హీరో..టీవీకే అధ్యక్షుడు విజయ్, భార్య సంగీత విడాకుల కేసును చెంగల్పట్టు కోర్టు జూన్ 15కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని విజయ్, సంగీతకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంగీత రూ.250 కోట్ల భరణం కోరుతున్నట్లు సమాచారం.

విడాకుల ప్రక్రియ కొనసాగుతుండగానే సంగీత తన నివాస హక్కుల కోసం (చెన్నై నీలంకరై ఇంట్లో ఉండేందుకు) ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. వీరిద్దరి మధ్య విడాకుల సెటిల్మెంట్ రూ. 250 కోట్ల నుండి రూ. 35 కోట్లకు తగ్గినట్లు తెలుస్తుంది. దీనిపై విజయ్, సంగీతల మధ్య ఏకాభిప్రాయం సాధించే నేపథ్యంలో కేసు వాయిదా పడినట్లుగా సమాచారం.

ఇవి కూడా చదవండి :

బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు
Chiranjeevi | పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది … అభిమానులకు ధైర్యం చెప్పిన చిరంజీవి