బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు

చైనాలో కదులుతున్న బస్సు కిటికీలోంచి వేలాడిన పసిపాపను స్కూటీపై వెంబడించిన పోలీసు అధికారి సాహసంగా కాపాడిన వీడియో వైరల్ అయింది.

బస్సు కిటికీలోంచి పసిపాప..సాహసంతో కాపాడిన వాహనదారుడు

విధాత : బస్సు కిటికీలోంచి పసిపాప కిందకు వేలాడుతూ పడిపోతున్న క్రమంలో ఓ వాహనదారుడు ఆపద్భాంధవుడిలా సాహసంతో రక్షించిన ఘటన వీడియో వైరల్ గా మారింది.
చైనాలోని హునాన్ రాష్ట్రంలోని జాంగ్జియాజీలో కదులుతున్న బస్సు కిటికీలోంచి ఓ చిన్నారి ప్రమాదకరంగా వేలాడుతూ ఏ క్షణాన్నైనా కిందకు పడిపోయే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై వెలుతున్న బస్సు నుంచి ఆ చిన్నారి పడిపోతే ప్రాణాపాయం తప్పని పరిస్థితి కనిపించింది. సరిగ్గా ఆ సమయంలో బస్సు వెనుక చి స్కూటీపై వస్తున్న పోలీసు అధికారి వు షెంగ్జే ఆ చిన్నారిని గమనించాడు.

బస్సును వెంబడించి చిన్నారి వద్దకు స్కూటి చేరుకోగానే దానిని రోడ్డుపైన పడేసి ఒక్క ఉదుటున చిన్నారిని అందుకున్నాడు. తన సాహసంతో చిన్నారిని కాపాడిన షెంగ్జే వ్యవహారం సీసీటీవీ ఫుటేజ్‌ నెట్టింటా వైరల్ గా మారింది. చిన్నారిని కాపాడే క్రమంలో తనకు తీవ్రమైన గాయాలు కాకుండా షెంగ్జే అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. తన ప్రాణాలను లెక్కచేయకుండా చిన్నారిని కాపాడిన అతడి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

ఇవి కూడా చదవండి :

అత్యవసరంగా ఢిల్లీకి హరీశ్ రావు..కాళేశ్వరం తీర్పు టెన్షన్!
Viral Video | శవంతో పాటు కోటిన్నర బెంజ్ కారును పూడ్చిపెట్టిన చైనా ఫ్యామిలీ.. వీడియో వైరల్!