Viral News | శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు.. గదిలో నుంచి పరార్!

Viral News | టర్కీలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి ముందు ఎప్పుడూ మేకప్‌లో కనిపించిన భార్యను.. శోభనం రాత్రి సహజంగా కనిపించడంతో కంగుతిన్నాడు. ఆ షాక్‌లోనే గదిలో నుంచి బయటకు పరుగు తీశాడు.

Viral News | శోభనం రాత్రి భార్యను మేకప్ లేకుండా చూసి కంగుతిన్న కొత్త పెళ్లి కొడుకు.. గదిలో నుంచి పరార్!

Viral News | టర్కీలో జరిగిన ఓ వింత ఘటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లికి ముందు ఎప్పుడూ మేకప్‌లో కనిపించిన భార్యను.. శోభనం రాత్రి సహజంగా కనిపించడంతో కంగుతిన్నాడు. ఆ షాక్‌లోనే గదిలో నుంచి బయటకు పరుగు తీశాడు. విడాకులు కావాలవని కోర్టు మెట్లెక్కాడు.

వైరల్ కథనం ప్రకారం.. టర్కీలోని ఇస్తాంబుల్‌కు చెందిన 29 ఏళ్ల యూసుఫ్‌ అనే వ్యక్తికి 27 ఏళ్ల ఎలిఫ్‌తో 11 నెలల కిందట ఎంగేజ్‌మెంట్ అయ్యింది. అప్పట్నుంచి వారు తరచూ వీడియోకాల్స్ మాట్లాడుకునేవారు. ఫొటోలు పంపించుకునేవారు. అప్పుడప్పుడు బయట కలుసుకునేవారు. కానీ ఎప్పుడు కలిసినా ఫుల్ మేకప్‌తోనే కనిపించేదట. అయితే ఇటీవల వారికి వివాహం జరిగింది. పెళ్లయిన రాత్రే ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేశారు.

దాదాపు ఏడాదిగా రిలేషన్‌లో ఉన్న అమ్మాయితో తొలి రాత్రి అనగానే వరుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనను కలలు కన్న రోజు వచ్చిందని సంబురపడుతూ శోభనం గదిలోకి వెళ్లాడు. కానీ లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ ఉన్న వధువును చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మేకప్ లేకుండా సహజ రూపంలో ఉన్న ఆమెను చూసి మోసపోయానని లబోదిబోమంటూ శోభనం గదిలో నుంచి బయటకు పరుగు తీశాడు. ఆ వెంటనే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కాడు.

‘నేను పెళ్లి చేసుకున్న మహిళ వేరు.. ఇప్పుడు కనిపిస్తున్న మహిళ వేరు’ అంటే తమ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు విన్నవించుకున్నాడు. అంతేకాదు తాను ప్రపోజ్ చేసి, ఎంగేజ్‌మెంట్ చేసుకున్నప్పటి ఫొటో, శోభనం రాత్రి మేకప్ లేకుండా ఉన్నప్పటి ఫొటో రెండింటినీ జత చేసి కోర్టుకు సమర్పించాడు. కాగా వరుడి ఆరోపణలపై వధువు ఎలిఫ్ కూడా స్పందించింది. తనకు సాధారణ మొటిమలు, మచ్చలు ఉన్నాయని.. అవి తప్పేం కాదు కదా అని ప్రశ్నించింది. తన నిజమైన మొహాన్ని ఎన్నోసార్లు చూశాడని చెప్పుకొచ్చింది.

ఇక ఈ ఘటనకు సంబంధించినవి అనే చెప్పే రెండు ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిలో ఒక ఫొటోలో వధువు హెవీ మేకప్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుండగా.. మరో ఫొటోలో సహజ రూపం కనిపిస్తోంది. ఇవి చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది వరుడి వైఖరిని తప్పుబడుతున్నారు. వివాహం అనేది కేవలం రూపురేఖల మీద ఆధారపడదని.. మేకప్ ఒక ఆప్షన్ మాత్రమే అని కామెంట్లు పెడుతున్నారు. ప్రతిరోజు ఏ మహిళా మేకప్‌తో ఉండలేదని.. సహజ స్వరూపాన్ని అంగీకరించడమే నిజమైన బంధమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం వరుడి అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. సోషల్‌‌మీడియా ఫిల్టర్లు, మేకప్, ఫొటో ఎడిటింగ్ కారణంగా వ్యక్తుల నిజమైన రూపం తెలియకుండా పోతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More:

Jackpot | ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్‌కు కోట్ల రూపాయల జాక్‌పాట్!

చైనా తల్లిదండ్రులకు రష్యన్ లుక్స్‌లో చిన్నారి.. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తే.. షాకింగ్ విషయం వెలుగులోకి!