Jackpot | ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్‌కు కోట్ల రూపాయల జాక్‌పాట్!

Jackpot | న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తికి తన పాత ప్యాంటు జేబులో మరిచిపోయిన లాటరీ టికెట్ బయటపడగా.. దానికి కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఆశ్చర్యకరంగా టికెట్ గడువు ముగియడానికి కేవలం వారం రోజుల ముందే ఈ టికెట్ దొరకడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Jackpot | ఇది కదా అదృష్టమంటే.. పాత ప్యాంటులో దొరికిన లాటరీ టికెట్‌కు కోట్ల రూపాయల జాక్‌పాట్!

Jackpot | అదృష్టం ఎప్పుడు.. ఎలా తలుపుతడుతుందో ఎవరూ ఊహించలేరు. అమెరికాలో తాజాగా జరిగిన ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తికి తన పాత ప్యాంటు జేబులో మరిచిపోయిన లాటరీ టికెట్ బయటపడగా.. దానికి కోట్ల రూపాయల జాక్‌పాట్ తగిలింది. ఆశ్చర్యకరంగా టికెట్ గడువు ముగియడానికి కేవలం వారం రోజుల ముందే ఈ టికెట్ దొరకడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

న్యూజెర్సీకి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మేలో తనకు పరిచయం ఉన్న ఒక పెట్రోల్ బంక్‌లో పిక్ 6 లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడో పెట్టాడు. ఎంత వెతికినా దొరకలేదు. కొద్దిరోజులకు ఆ టికెట్ గురించి కూడా మరిచిపోయాడు. అలా ఏడాది గడిచిపోయింది. అయితే ఆ వ్యక్తి కొన్న టికెట్‌కే లాటరీ తగిలింది. కానీ ఏడాదిగా ఎవరు లాటరీ క్లైయిమ్ చేసుకోవడానికి రాలేదు. దీంతో పిక్ 6 లాటరీ నిర్వాహకులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు.

త్వరలోనే ఈ లాటరీ టికెట్ గడువు పూర్తవుతుందని.. అదృష్టవంతులు వెంటనే వచ్చి క్లైయిమ్ చేసుకోవాలని నిర్వాహకులు ప్రకటించారు. ఆ ప్రకటన చూసిన వ్యక్తికి అనుమానం వచ్చింది. ఎందుకంటే తాను రెగ్యులర్‌గా వెళ్లే పెట్రోల్ బంక్‌లో అమ్మిన టికెట్‌గా లాటరీ తగిలిందని తెలియడంతో కొంచెం ఆశ కలిగింది.

వెంటనే ఆ పెట్రోల్ బంక్‌కు వెళ్లి సిబ్బందిని లాటరీ గురించి ఆరా తీశాడు. తమ పెట్రోల్ బంక్‌కు వచ్చేవారిలో కొద్దిమంది మాత్రమే ఈ టికెట్లు కొంటుంటారని.. ఒకసారి ఇంటికి వెళ్లి టికెట్‌ కోసం బాగా వెతకండి అని పెట్రోల్ బంక్ సిబ్బంది సూచించారు. దీంతో ఇంటికి వెళ్లిన ఆ వ్యక్తి ఇంట్లోని డ్రాయర్లు, అల్మారాలు, స్టోరేజ్ బాక్స్‌లు అన్నీ వెతికాడు. కానీ ఎక్కడా లాటరీ టికెట్ కనిపించలేదు. చివరకు పాత బట్టలను పరిశీలిస్తుండగా.. ఒక పాత ప్యాంట్ జేబులో మడతపెట్టిన లాటరీ టికెట్ కనిపించింది. ఆ వెంటనే నంబర్లు చెక్ చేయగా.. అతని టికెట్‌‌కే లాటరీ తగిలిందని తెలిసింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు.

అనంతరం ఆ టికెట్‌ను తీసుకుని పిక్-6 లాటరీ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి క్లైయిమ్‌ చేశాడు. అలా మొత్తానికి 5.9 అమెరికన్ డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.57 కోట్ల జాక్‌పాట్‌ను పొందాడు. గడువు ముగియడానికి కేవలం వారం ముందే ఈ టికెట్ దొరకడం అదృష్టమని లాటరీ నిర్వాహకులు పేర్కొన్నారు.

Read More:

చైనా తల్లిదండ్రులకు రష్యన్ లుక్స్‌లో చిన్నారి.. అనుమానం వచ్చి డీఎన్‌ఏ టెస్ట్ చేయిస్తే.. షాకింగ్ విషయం వెలుగులోకి!

ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్.. లక్షల్లో జీతం.. అయినా జాబ్ మానేసిన పాతికేళ్ల కుర్రాడు