Hansika | విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక.. “తప్పుడు రైలులో ప్రయాణం కంటే దిగిపోవడమే మంచిది”

Hansika | దక్షిణాది ప్రముఖ నటి హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల మధ్య నెల రోజుల తర్వాత తొలిసారి స్పందించారు. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో చట్టపరంగా విడిపోయిన తర్వాత ఈ అంశంపై మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై స్పందించే ఉద్దేశం తనకు లేదని హన్సిక స్పష్టం చేశారు.

  • By: Sandeep |    movies |    Published on : Apr 18, 2026 7:58 AM IST
Hansika | విడాకులపై తొలిసారి స్పందించిన హన్సిక.. “తప్పుడు రైలులో ప్రయాణం కంటే దిగిపోవడమే మంచిది”

Hansika | దక్షిణాది ప్రముఖ నటి హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న వార్తల మధ్య నెల రోజుల తర్వాత తొలిసారి స్పందించారు. వ్యాపారవేత్త సోహైల్ ఖతురియాతో చట్టపరంగా విడిపోయిన తర్వాత ఈ అంశంపై మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వాటిపై స్పందించే ఉద్దేశం తనకు లేదని హన్సిక స్పష్టం చేశారు.

ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్ట్లో మార్చి 11న హన్సిక–సోహైల్ దంపతులకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత పలురకాల వార్తలు ప్రచారంలోకి రావడంతో, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఎట్ట‌కేల‌కి క్లారిటీ..

‘Hauterrfly’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, “వాళ్లకు క్లిక్‌బైట్ కావాలి… దొరికింది. హెడ్‌లైన్స్ కావాలి… అవీ వచ్చాయి. నేను దీనిపై ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వను కూడా. ఎందుకంటే అది నాకు ముఖ్యం కాదు. తప్పుడు రైలులో ప్రయాణించడం కంటే దిగిపోవడమే మంచిది” అని పేర్కొన్నారు. విడిపోయిన తర్వాత తాను మానసికంగా మరింత బలంగా మారానని, ప్రజల అభిప్రాయాల కంటే తన వ్యక్తిగత శ్రేయస్సుకే ప్రాధాన్యం ఇస్తున్నానని ఆమె తెలిపారు.

ఈ విడాకుల వ్యవహారం పూర్తిగా వ్యక్తిగతమని, అది ఇద్దరి మధ్యే ఉండాలని హన్సిక స్పష్టం చేశారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తల్లి, సోదరుడికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. విడాకుల అనంతరం కుటుంబంతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లి కొంత సమయం గడిపినట్లు తెలిసింది.

సినిమాల‌తో బిజీ..

హన్సిక–సోహైల్ వివాహం 2022 డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ముండోటా ఫోర్ట్ అండ్ ప్యాలెస్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలను ‘Hansika’s Love Shaadi Drama’ పేరుతో 2023లో జియో హాట్‌స్టార్లో సిరీస్‌గా విడుదల చేశారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, హన్సిక ఇటీవల ‘గార్డియన్’ సినిమాలో నటించారు. ఈ చిత్రానికి సబరి, గురు శరవణన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. అలాగే ఆమె తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2’కు జడ్జిగా వ్యవహరించారు.

ప్రస్తుతం హన్సిక ‘నషా’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఆమె, ఇప్పుడు పూర్తిగా తన కెరీర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.