Vijay | దళపతి విజయ్‌కు భార్య సంగీత విడాకుల పిటీషన్… ఆ న‌టితో అక్రమ సంబంధ‌మే కార‌ణ‌మా?

Vijay | టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజ‌య్‌(దళపతి విజయ్) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళనాడు రాజకీయాలు, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పిటిషన్‌లో సంగీత చేసిన ఆరోపణల ప్రకారం, 2021 ఏప్రిల్‌లో తన భర్త విజయ్ ఓ ప్రముఖ నటి‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు.

  • By: sn |    movies |    Published on : Feb 28, 2026 8:15 AM IST
Vijay | దళపతి విజయ్‌కు భార్య సంగీత విడాకుల పిటీషన్… ఆ న‌టితో అక్రమ సంబంధ‌మే కార‌ణ‌మా?

Vijay | టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడు విజ‌య్‌(దళపతి విజయ్) వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన భార్య సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం తమిళనాడు రాజకీయాలు, సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పిటిషన్‌లో సంగీత చేసిన ఆరోపణల ప్రకారం, 2021 ఏప్రిల్‌లో తన భర్త విజయ్ ఓ ప్రముఖ నటి‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసిందని పేర్కొన్నారు. ఆ విషయం తెలిసిన తరువాత తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, దాంపత్య నమ్మకాన్ని భంగం చేశారని ఆరోపించారు. మొదట ఈ సంబంధానికి ముగింపు పలుకుతానని విజయ్ హామీ ఇచ్చినప్పటికీ, తరువాత కూడా అదే కొనసాగిందని ఆమె కోర్టుకు వివరించినట్టు సమాచారం.

ఇటీవలి కాలంలో విజయ్ – త్రిష‌ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ తమిళ రాజకీయ వర్గాల్లో విమర్శలు వినిపించిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలను కొందరు తరువాత ఉపసంహరించుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ప్రస్తుతం దాఖలైన పిటిషన్ నేపథ్యంలో ఆ ప్రచారాలు మళ్లీ ప్రాధాన్యం పొందుతున్నాయి.

కౌన్సిలింగ్ విఫలం

సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య కౌన్సిలింగ్ ద్వారా సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించానని సంగీత తెలిపారు. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, తనను దూరంగా ఉంచి ఆ నటితో కలిసి విదేశాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయని, సోషల్ మీడియాలో ఇద్దరి ఫోటోలు వైరల్ కావడం తనకు, పిల్లలకు అవమానంగా అనిపించిందని ఆమె ఆరోపించారు.

ఆ ఫోటోలు, కథనాలపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డం పరోక్షంగా అంగీక‌రించిన‌ట్టు భావించాల్సి వచ్చిందని కూడా ఆమె కోర్టుకు వివరించినట్టు సమాచారం.

ఆర్థిక, వ్యక్తిగత పరిమితుల ఆరోపణ

2024 ఆగస్టు నుంచి 2025 ఫిబ్రవరి వరకు మళ్లీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని సంగీత పేర్కొన్నారు. పైగా, తనపై ఆర్థిక పరిమితులు విధించడమే కాకుండా, వ్యక్తిగత స్వేచ్ఛను కూడా కట్టడి చేశారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో విజయ్‌తో వైవాహిక బంధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని, విడాకులు మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు.

నటి పేరు పిటిషన్‌లో లేదు

గమనించదగ్గ విషయం ఏమిటంటే, పిటిషన్‌లో ఎక్కడా నటి పేరు స్పష్టంగా పేర్కొనలేదని సమాచారం. అయినప్పటికీ, ఆ వ్యక్తికీ నోటీసులు జారీ చేయాలని కోర్టును కోరినట్టు తెలుస్తోంది. కేసు విచారణను కెమెరా కనుసన్నల్లో (ఇన్-కెమేరా) నిర్వహించాలని కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళ చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ లేదా సంబంధిత వర్గాల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.