Gold Silver Price Today | పెరిగిన బంగారం..తగ్గిన వెండి

అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు.. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,510 తగ్గి రూ. 1,63,640వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. రూ. 2,89,900వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Mar 07, 2026, 12:52 pm IST
Read Time: 5 mins
Gold Silver Price Today | పెరిగిన బంగారం..తగ్గిన వెండి

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక, రాజకీయ పరిణామాలు.. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు బంగారం, వెండి ధరలలో అస్థిరతను కొనసాగిస్తున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,510 తగ్గి రూ. 1,63,640వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,300తగ్గి రూ.1,50,000 వద్ద నిలిచింది. వెండి ధరలు మాత్రం స్వల్పంగా దిగివచ్చాయి. కిలో వెండి ధర రూ. 100 తగ్గి.. రూ. 2,89,900వద్ద కొనసాగుతుంది.

బంగారం, వెండి ధరలపై యుద్దం ప్రభావం

మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం..ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అలజడిని రేపుతుది. యుద్ద ప్రభావంతో స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. చమురు, గ్యాస్ తో పాటు బంగారం, వెండి ధరలలోనూ ధరల అస్థిరత పెట్టుబడిదారులను గందరగోళ పెడుతుంది. యుద్ధం కొనసాగే సూచనలు ఉన్నాయన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్టేట్ మెంట్ దెబ్బ మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడులైన బంగారం, వెండి వంటి విలువైన లోహాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం, వెండి ధరలలో భారీ హెచ్చతగ్గులు నమోదవుతున్నాయి. మొన్నటిదాకా కాస్త తగ్గాయనుకున్న బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి.

ముఖ్యంగా యుద్దం కారణంగా దుబాయ్ నుండి భారత్ సహా ఇతర దేశాలకు బంగారం రవాణా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆటంకం ఏర్పడింది. కార్గో రవాణలో అంతరాయం నెలకొంది. దీంతొ దుబాయ్‌లో పెద్ద మొత్తంలో బంగారం నిలిచిపోయింది. భారతీయ బంగారం వ్యాపారలు ఎక్కువగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్ నుంచి బంగారం కొనుగోలు చేస్తుంటారు. యుద్ద పరిణామాలతో రవాణా మార్గాలు స్తంభించడంతో డీలర్లు ప్రస్తుతం కొత్త ఆర్డర్‌లు ఇవ్వడం లేదా ఇప్పటికే ఉంచిన ఆర్డర్‌లను తీసుకోవడంలో స్తబ్ధత ఏర్పడటం బంగారం మార్కెట్ ను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతానికి భారతదేశం, ఇతర ఆసియా కొనుగోలుదారులకు సరిపడే బంగారం నిల్వలు ఉన్నప్పటికి.. యుద్ద పరిస్థితుతలో భారత్ కు బంగారం ఎగుమతుల్లో ప్రతిష్టంభన ఏర్పడితే మాత్రం మునుముందు బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

colored cotton crops| కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!
Gaddar Awards 2025 | గద్దర్ పురస్కారాల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా నాగ చైత‌న్య‌, చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ అవార్డు