Colored Cotton Crops | కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త వంగడాల పరిశోధనల చలవతో ఇక మార్కెట్‌లోకి తెల్లటి పత్తి పంటకు ప్రత్యామ్నాయంగా.. రంగు రంగుల పత్తి రకాలు రంగప్రవేశం చేయబోతుండటం సంచలనంగా మారింది. ఈ విషయం రైతన్నలను, నేతన్నలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Mar 07, 2026, 12:56 pm IST
Read Time: 5 mins
Colored Cotton Crops | కలర్ కాటన్ క్రాప్స్ !..ఇక రంగుల పత్తి రంగప్రవేశం!!

విధాత : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదం చేస్తుంది. ఇటీవల దేశీయ మార్కెట్ లోని పత్తి పంట దిగుబడుల కోత మిషన్ అడుగుపెట్టగా…తాజాగా పత్తి(Cotton) పంటల సాగులో మరో సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటిదాక పత్తి పంట అంటే తెల్ల రంగులో ఉండే పత్తి ఒక్కటే అని అందరికి తెలిసిందే. తెల్లని పత్తితో వడికి, రంగులు అద్ది రకరకాల రంగుల్లో వస్త్రాలను తయారు చేయడం కొనసాగుతుంది. అయితే వ్యవసాయ రంగంలో సరికొత్త వంగడాల పరిశోధనల చలవతో ఇక మార్కెట్‌లోకి రంగు రంగుల పత్తి రకాలు(colored cotton crops) రంగప్రవేశం చేయబోతుండటం సంచలనంగా మారింది. ఈ విషయం రైతన్నలను, నేతన్నలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.

నాగ్‌పూర్‌లోని ఐసీఏఆర్(ICAR) శాస్త్రవేత్తలు గోధుమ, ముదురు గోధుమ(brown), ఆకుపచ్చ (green) రంగుల్లో పండే సరికొత్త పత్తి రకాల వంగడాలను అభివృద్ధి చేశారు. వస్త్ర పరిశ్రమలో రసాయన రంగుల అవసరాన్ని తగ్గించేందుకు ఈ కొత్త రకం రంగుల పత్తి వంగడాలను అభివృద్ది చేసినట్లుగా వెల్లడించారు. నాలుగు రకాలు గోధుమ, ముదురు గోధుమ, ఆకుపచ్చ, నీలి, నలుపు రంగుల పత్తి సాగుపై పాతికేళ్లుగా ప్రయోగాలు కొనసాగుతున్నాయని, ప్రస్తుతం ప్రయోగాత్మకంగా గోధుమ, పచ్చ రంగుల పత్తి పంట రకాలను ముందుగా అభివృద్ది చేయగలిగామని తెలిపారు. అయితే రంగుల పత్తి తక్కువ స్టేపుల్ పొడవును కల్గి ఉంటుందని, ఇది జాకెట్లు(కోట్లు), రుమాల్లు, చిన్నారుల దుస్తుల తయారికి బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

రసాయన రంగుల వస్త్రాలకు చెక్

సహజసిద్దమైన రంగులతో పండించే రంగుల పత్తితో… వస్త్రాల తయారీలో సింథటిక్ డైయింగ్(రసాయన రంగుల వినియోగం) రంగుల వినియోగాన్ని భారీగా తగ్గించి భారీగా నీటిని ఆదా చేయవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఫలితంగా నదుల్లోకి ప్రమాదకర రసాయన వ్యర్థాలు చేరకపోవడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని తెలిపారు. స్థిరమైన వ్యవసాయం, పర్యావరణ అనుకూల వస్త్రాల వైపుగా రంగుల పత్తి పంట గణనీయమైన పురోగతి వంటిదని అభిప్రాపడ్డారు. విదర్భలోని రైతుల బృందంతో రంగులు పత్తి సాగుపై ఇన్స్టిట్యూట్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు.

 

ఇవి కూడా చదవండి :

Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు
Gold Silver Price Today | పెరిగిన బంగారం..తగ్గిన వెండి