విధాత : తమిళనాడు ప్రజలు కావేరీ నదిని భక్తిశ్రద్దలతో ఆరాధిస్తుంటారు. తాజాగా తమ గ్రామానికి వచ్చిన కావేరి నది జలాలకు అక్కడి గ్రామాల ప్రజలు తీరాన భక్తిపూర్వకమైన పూజలు నిర్వహిస్తున్న వీడియో వైరల్ గా మారింది. తీర గ్రామ వాసులను పలకరించేందుకు వస్తున్నట్లుగా ..నదిలో జలజల పారుతూ వస్తున్న కావేరి జలాలకు స్థానికులు ఎదురెళ్లి మంగళ హారతులతో స్వాగతాలు పలుకుతూ..ఇసుకలో సాష్టాంగ నమస్కారం చేస్తూ..ఆకులు, పువ్వులతో దీపాలు వెలిగిస్తూ, నైవెద్యాలు సమర్పిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. కావేరి నది జలాలను తాకి నెత్తిన జల్లుకుంటూ తన్మయత్వం పొందారు. ఈ తంతు ప్రతి ఏడాది జరుగుతుంది.
తాజాగా ఈ ఏడాది కూడా కావేరి జలాలు తమిళ గడ్డను తాకుతున్న తరుణంలో డెల్టా ప్రాంత ప్రజలు హరతులిస్తూ.. పూజలు చేశారు తమ జీవితాల్లో వెలుగు నింపి, పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని కావేరమ్మను వేడుకుంటూ ఉంటారు. కన్నడ గడ్డ నుంచి తమిళ నేలపైకి కావేరి జలాలు వచ్చే సమయంలో తమిళనాడు డెల్టా ప్రాంత ప్రజలు పడే సంతోషం అంతా ఇంతా కాదు. కావేరమ్మ తల్లి.. మాకు జీవనాధారమై.. మాకు బతుకునిచ్చేందుకు వచ్చావా తల్లీ.. అంటూ తమ ఆనందభాష్పాలతో కావేరి నీళ్లకు అభిషేకం చేస్తారు. నీరు అలా వస్తుంటే.. కాలువల్లోకి దిగి.. మొక్కుతుంటారు. దక్షిణ భారత హిందూ సంప్రదాయంలో దేవతగా ఆరాధించబడే కావేరీ నది పట్ల తమిళ ప్రజల భక్తి ప్రపత్తులను ఈ వీడియో హైలైట్ చేస్తుంది. అలాగే, వ్యవసాయం, ప్రాంతీయ ఆచార సాంప్రదాయాలకు, ప్రజలకు మధ్య ఉన్న బంధాన్ని, నదీ ఆరాధనకు, సజీవ సాంస్కృతిక ఆచారానికి ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
The people of Tamil Nadu welcoming Kaveri river. pic.twitter.com/16sDUZTL36
— Bhagavad Gita (@GitaShlokas_) July 4, 2026