Donkey Farming | మీకు తెలుసా…గాడిదల పెంపకానికి కేంద్ర సర్కార్ ఆర్థిక ప్రోత్సాహకాలు!
కేంద్ర ప్రభుత్వం గాడిదల పెంపకానికి రూ.50 లక్షల సబ్సిడీ, బ్యాంక్ రుణాలు అందిస్తూ దేశీయ జాతులను సంరక్షించడానికి ప్రోత్సహిస్తోంది.
విధాత : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలైన పశువులు, కోళ్లు, చేపల వంటి వాటికి, పట్టు పరుగుల పెంపకంకు ఆర్థిక సహాయం చేస్తుండటం అందరికి తెలిసిందే. అయితే గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహాకాలు అందిస్తుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గాడిదల పెంపకం చేపట్టే రైతులకు రూ.50 లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తోంది.
భారతదేశంలో వేగంగా తగ్గుతున్న గాడిదల జనాభాను పునరుద్ధరించడంలో సహాయపడటంతో పాటు పశువుల వ్యాపారాలను ప్రోత్సహించడం ఈ పథకం లక్ష్యం. గాడిదల పాల ఉత్పత్తి, ఔషధ వినియోగం, ఎగుమతుల అవకాశాల నేపథ్యంలో గాడిదల పెంపకం లాభదాయకమైన రంగంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది. అందుకే గాడిదల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ లైవ్‌స్టాక్ మిషన్ ద్వారా గాడిదలు, గుర్రాలు, ఒంటెలు వంటి పెంపకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. బ్రీడింగ్ ఫామ్‌లకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రూ. 50 లక్షల వరకు మూలధన సబ్సిడీని అందించడం ద్వారా రైతులకు ఆర్థిక చేయూత అందించాలని నిర్ణయించినట్లుగా ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వం గాడిద పెంపకాన్ని ఎందుకు ప్రోత్సహిస్తోంది?
స్థానిక పశువుల రకాలను సంరక్షించే ప్రయత్నాలలో భాగంగా ఈ పథకం దేశీయ జాతులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. దేశంలో గాడిద జనాభాలో తగ్గుదలను అరికట్టా వాటి జనాభాను పెంచే లక్ష్యం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. 20వ పశుగణన డేటా ప్రకారం 2019లో భారతదేశంలో దాదాపు 1.23 లక్షల గాడిదలు ఉన్నాయి. ఇది 2012తో పోలిస్తే దాదాపు 60% తగ్గుదల అని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
ఒకప్పుడు గ్రామీణ రవాణా, నిర్మాణ పనులలో గాడిదలను విస్తృతంగా ఉపయోగించేవారు. కానీ యాంత్రీకరణ జంతు రవాణా డిమాండ్‌ను గణనీయంగా తగ్గించిన నేపథ్యంలో గాడిదల జనాభా తగ్గిపోవడానికి కారణంగా మారిపోయింది. ఈ సమస్య పరిష్కారం దిశగా బ్రీడింగ్ ఫామ్‌లలో పెట్టుబడి పెట్టడానికి, దేశీయ జంతువులను సంరక్షించడానికి ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది.
గాడిదల పెంపకం స్కీమ్ వివరాలు:
ఈ మిషన్ కింద గాడిద బ్రీడింగ్ యూనిట్‌కు అర్హత సాధించాలంటే, ఒక ప్రాజెక్ట్‌లో కనీసం 50 ఆడ గాడిదలు, 5మగ గాడిదలు ఉండాలి. సబ్సిడీని రెండు విడతలుగా విడుదల చేస్తారు, ప్రాజెక్ట్ కోసం బ్యాంకు రుణం ఆమోదించబడిన తర్వాత మొదటి విడత అందించబడుతుంది.ఫామ్ పూర్తయిన తర్వాత, అధికారులు ధృవీకరించిన తర్వాత రెండవ విడత చెల్లించబడుతుంది.
రైతుల కోసం ఇతర పశుసంవర్ధక పథకాలు
ఎన్ఎల్ఎం సబ్సిడీతో పాటు,పశువుల పెంపకందారులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వాటిలో ఒకటి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్. ఇది చిన్న పశువుల పెంపకందారులు తరచుగా రాయితీ వడ్డీ రేట్లకు పూచీకత్తు లేకుండా రూ. 1.6 లక్షల వరకు రుణాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది. అలాగే రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా దేశీయ పశువులు, గేదె జాతుల పెంపకానికి, కృత్రిమ గర్భధారణ సేవలతో బ్రీడింగ్ ఫామ్‌లకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ పథకాలు రైతులు, గ్రామీణ ప్రజల ఆదాయాలను పెంచడం, పశువుల ఉత్పాదకతను మెరుగుపరచడం, దేశీయ జంతు జాతులను సంరక్షించడం లక్ష్యంగా అమలు కాబడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
Telangana Weather | తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు
కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram