Telangana Weather | తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు

తెలంగాణలో మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరగా వడగాల్పులపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Mar 07, 2026, 2:36 pm IST
Read Time: 3 mins
Telangana Weather | తెలంగాణలో 40డిగ్రీలకు చేరిన ఉష్ఱోగ్రతలు

విధాత, హైదరాబాద్ : తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపం ధాటికి రాష్ర్టంలో పలు చోట్ల శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు ఉక్కపోత కూడా మొదలైంది. ఇప్పటికే ఎండల మంట తీవ్రంగా ఉండగా రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఎండల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు… చిన్న పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది అధిక వర్షపాతం, ఎక్కువ చలి తీవ్రత వల్లే ఎండలు అధికంగా ఉంటాయని వాతావారణ శాఖ వెల్లడించింది.

ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, ఆదిలాబాద్‌, జగిత్యాల జిల్లాలకువాతావరణ కేంద్రం రెడ్‌అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రత 39 నుంచి 41 డిగ్రీలకు చేరిందని, రాబోయే నాలుగు రోజులు ఇవే గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పేర్కొంది. తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు వీచే అవకాశమున్నదని హెచ్చరించింది. ఆదిలాబాద్‌ అర్బన్‌, ధర్మపురి, ఖమ్మం అర్బన్‌ ప్రాంతాల్లో 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 14 జిల్లాల్లో 38.5 డిగ్రీలపైనే రికార్డు అయ్యింది. హైదరాబాద్‌ నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37-39 డిగ్రీలుగా నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి :

Woman kills Puppies In Tamil Nadu | అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ
Netflix Studios | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి