Netflix Studios | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్.. ఈ నెల12న ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
Netflix Studios | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తెలంగాణలో తన కార్యాలయాన్ని ఏర్పాటు నెలకొల్పనుంది. హైదరాబాద్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.
Netflix Studios | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ తెలంగాణలో తన కార్యాలయాన్ని ఏర్పాటు నెలకొల్పనుంది. హైదరాబాద్‌లో 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటుఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. దీన్ని ఈ నెల 12వ తేదీ సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు.
నెట్‌ఫ్లిక్స్ ఇండియాలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక్కడ విస్తరణపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ రంగంపై ఫోకస్ చేసి హైదరాబాద్‌లో ఒక ఆఫీసును తెరవాలని నిర్ణయించింది. ఇప్పటికే ముంబైలో నెట్‌ఫ్లిక్స్ కార్యాలయం ఉండగా.. ఇది భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు రెండో కార్యాలయం కానుంది.
AVGC రంగానికి ప్రోత్సాహం
నెట్‌ఫ్లిక్స్ విస్తరణతో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (AVGC) రంగం మరింత పటిష్టం కానుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల సృజనాత్మకత, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు విరివిగా ఉద్యోగవకాశాలు లభిస్తాయి. అలాగే హైదరాబాద్‌ను డిజిటల్ కంటెంట్ సృష్టిలో అగ్రగామిగా నిలబెట్టే అవకాశం లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వార్నర్ బ్రదర్స్, డిస్నీ, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, ఉబిసాఫ్ట్ వంటి ప్రధాన హాలీవుడ్ నిర్మాణ సంస్థలకు కావాల్సిన వీఎఫ్‌ఎక్స్ సేవలను ఇప్పటికే హైదరాబాద్‌లోని అనేక వీఎఫ్‌ఎక్స్ సంస్థలు అందిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో నెట్‌ఫ్లిక్స్ ఏవీజీసీ ఏర్పాటుతో ఈ రంగంలో హైదరాబాద్ ప్రధాన ప్రపంచ కేంద్రంగా మారే అవకాశం కనిపిస్తోంది.
హాలీవుడ్ సినిమాల్లో వాడే మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఇప్పటికే హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన M&M క్యాప్ ల్యాబ్‌ను ఇప్పటికే ప్రారంభించిన సంగతి తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram