• Telugu News
  • /Trending

Woman kills Puppies In Tamil Nadu | అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ

తమిళనాడులో ఓ మహిళ కుక్క పిల్లలను గోడకు కొట్టి చంపిన దారుణ ఘటన వైరల్ అయింది. సీసీటీవీ వీడియో బయటపడటంతో జంతు సంరక్షణ సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Reported by: Y.V. Narsimha Reddy | ట్రెండింగ్ | Mar 07, 2026, 1:45 pm IST
Read Time: 3 mins
Woman kills Puppies In Tamil Nadu | అమానుషం..కుక్క పిల్లలను గోడకు కోట్టి చంపిన మహిళ

విధాత : మనవత్వాన్ని విస్మరించి అమ్మతనాన్ని మరిచి ఓ మహిళ ఉన్మాదిగా మారి చిన్నారి కుక్క పిల్లలను గోడకు కొట్టి చంపిన అమానుష ఘటన వీడియో వైరల్ గా మారింది. జంతు ప్రేమికులను కలవరపెట్టే ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ ఎదురుంటి వారిపై ఉన్న కోపాన్ని చిన్నారి మూగజీవులపై తీర్చుకుంది. కనికరం లేకుండా వాటిని గోడకేసి కొట్టగా అవి చనిపోగా.. మరో రెండింటిని తాడుతో చెట్టుకు వేలాడతీసి అమానుషంగా ప్రవర్తించింది.మూగజీవాలపై దారుణంగా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

తిరుచ్చి శివార్లలోని కంబరసంపెట్టై వద్ద 28 ఏళ్ల అనుమానితురాలు జె. మీనాక్షి మిశ్రా తన పొరుగువారితో నెలకొన్న వివాదం నేపథ్యంలో ఇంటి ముందుకు వచ్చిన కుక్కపిల్లలో రెండింటిని కాంపౌండ్ గోడకు విసిరికొట్టి చంపేసింది. మరో రెండింటిని సమీపంలోని చెట్టుకు వేలాడదీసింది. ఈ దారుణ ఘటన సీసీ టీవీలో రికార్డు అవ్వగా..దానిని జంతు సంరక్షణ సంస్థ కార్యకర్త విదిత్ శర్మ నెట్టింటా పోస్టు చేయగా అదికాస్తా వైరల్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న జంతు సంక్షేమ సంఘం ఫిర్యాదు మేరకు పోలీసులు మీనాక్షి మిశ్రా, ఆమె పొరుగువారిని అరెస్టు చేసి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం, 1960 కింద అభియోగాలు మోపారు. పీపుల్ ఫర్ యానిమల్ తిరుచ్చి ఉపాధ్యక్షుడు అజయ్ జీయపురం పోలీస్ స్టేషన్‌కు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ మహిళపై చర్య తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి :