Actress | ఇండస్ట్రీలో మొదలైన కొత్త ఉద్యమం… పబ్లిక్ ఈవెంట్లలో అభ్యంతరకర ఫోటోగ్రఫీపై కన్నడ నటీమణుల ఆగ్రహం
Actress | సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంతో హుందాగా, లగ్జరీగా జీవిస్తారని బయట ప్రపంచం భావిస్తుంది. కానీ ఆ వెలుగుల వెనుక వారు ఎదుర్కొనే ఇబ్బందులు చాలా సందర్భాల్లో బయటకు రావు. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్లు, షాప్ ఓపెనింగ్స్, సినిమా ఫంక్షన్లలో పాల్గొనే సమయంలో కొందరి ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.
Actress | సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎంతో హుందాగా, లగ్జరీగా జీవిస్తారని బయట ప్రపంచం భావిస్తుంది. కానీ ఆ వెలుగుల వెనుక వారు ఎదుర్కొనే ఇబ్బందులు చాలా సందర్భాల్లో బయటకు రావు. ముఖ్యంగా పబ్లిక్ ఈవెంట్లు, షాప్ ఓపెనింగ్స్, సినిమా ఫంక్షన్లలో పాల్గొనే సమయంలో కొందరి ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. సెలబ్రిటీల ప్రజాదరణను వినియోగించుకోవడానికి అనేక సంస్థలు వారిని తమ బ్రాండ్ల ప్రమోషన్ కోసం ఆహ్వానిస్తాయి. షాప్ ప్రారంభోత్సవాలు, బ్రాండ్ లాంచ్‌లు, సినిమా ఈవెంట్లు ఇలా పలు కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటుంటారు. ఈ కార్యక్రమాల గురించి ముందుగానే ప్రచారం చేయడంతో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటారు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో కొందరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇటీవల కన్నడ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులు ఈ విషయంపై బహిరంగంగా స్పందించడం చర్చకు దారి తీసింది. సప్తమి గౌడ, ఆషిక రంగనాథ్, రుక్మిణి వసంత్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అసహనం వ్యక్తం చేశారు. పబ్లిక్ ఈవెంట్లలో, సినిమా కార్యక్రమాల్లో తమను అభ్యంతరకరంగా చిత్రీకరించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. జూమ్ చేసి శరీర భాగాలను ఫోకస్ చేస్తూ ఫోటోలు తీయడం గౌరవప్రదం కాదని, ఇది వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీసే చర్య అని వారు పేర్కొన్నారు. హీరోయిన్లు కూడా ప్రొఫెషనల్స్ అని, ప్రతి సందర్భంలో మర్యాద, పరిమితులు పాటించాల్సిన బాధ్యత అందరికీ ఉందని గుర్తుచేశారు.
సినిమా రంగంలో ఇప్పటికే లైంగిక వేధింపులపై చర్చలు జరుగుతున్న తరుణంలో, ఇప్పుడు పబ్లిక్ ఈవెంట్లలో ఫోటోగ్రఫీ పేరుతో జరుగుతున్న ఈ చర్యలు మరోసారి భద్రతా అంశాన్ని ముందుకు తెచ్చాయి. అభిమానులు, ఫోటోగ్రాఫర్లు, ఈవెంట్ నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై ఇండస్ట్రీ పెద్దలు, సంఘాలు, నిర్వాహకులు ఎలాంటి మార్గదర్శకాలు తీసుకొస్తారో చూడాలి. అయితే నటీమణుల స్పందనతో గౌరవప్రదమైన ప్రవర్తనపై చర్చ మొదలైందనడంలో ఎలాంటి తప్పు లేదు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram