Haleem | హైదరాబాద్‌లో హలీం ఘుమఘుమలు.. రూ. 1000 కోట్ల టర్నోవర్ దాటేనా..?
Haleem | రంజాన్ పండుగ( Ramadan Festival ) సమీపిస్తుండడంతో హైదరాబాద్( Hyderabad ) నరగంలో గల్లీకో హలీం( Haleem ) బట్టి దర్శనమిస్తోంది. నగర వ్యాప్తంగా హలీం సందడి మొదలైంది. దీంతో భాగ్యనగరమంతా హలీం ఘుమఘుమలు గుప్పిస్తున్నాయి.
Haleem | రంజాన్ పండుగ( Ramadan Festival ) సమీపిస్తుండడంతో హైదరాబాద్( Hyderabad ) నరగంలో గల్లీకో హలీం( Haleem ) బట్టి దర్శనమిస్తోంది. నగర వ్యాప్తంగా హలీం సందడి మొదలైంది. దీంతో భాగ్యనగరమంతా హలీం ఘుమఘుమలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో హలీంను ఆరగించేందుకు హైదరాబాదీలు ఆరాటపడుతున్నారు. హలీంతో పాటు షీర్ ఖుర్మా, షహీ తుక్డా, కద్దూకా ఖీర్ వంటి వంటకాలను ఆరగించేందుకు నగర ప్రజలు సిద్ధమయ్యారు.
అయితే ఈ ఏడాది రంజాన్ పండుగ నేపథ్యంలో హలీం అమ్మకాల టర్నోవర్ రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గతేడాది రూ.800 కోట్ల టర్నోవర్ ఉండగా, ఈ సీజన్‌లో రూ.1000 కోట్లకు పైగా వ్యాపారం సాగే అవకాశాలున్నట్లుగా వ్యాపారులు చెబుతున్నారు. గత రంజాన్ సీజన్‌లో 50 లక్షల ప్లేట్ల హలీం విక్రయాలు జరిగాయి. ఈ సారి ఆ సంఖ్య 60 లక్షల పేట్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇక పేరొందిన హలీం సెంటర్లలో రోజుకు 25 వేల కిలోల హలీం తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. గల్లీలతో పాటు ఆయా సెంటర్లలోని హలీం కేంద్రాల్లో రోజుకు 200 కిలోల వరకు విక్రయాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇలా సగటున రోజుకు ఒక్కో హలీం సెంటర్‌లో రూ. 2 లక్షల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు.
రంజాన్ సీజన్‌లో సుమారు లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. రోజువారీ కూలీలు, పాకశాస్త్ర నిపుణులు, డెలివరీ బాయ్‌లుగా ఎంతో మంది యువకులు ఉపాధిని పొందుతారు. వీటిలో పనిచేసే ఒకరికి రోజూ రూ.800-1000 వరకు చెల్లిస్తారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram