Fire Accident | ప్ర‌యివేటు బ‌స్సులో చెల‌రేగిన అగ్నికీల‌లు.. 39 మంది ప్ర‌యాణికులు సేఫ్‌

Fire Accident | మ‌ళ్లీ ఓ ప్ర‌యివేటు బ‌స్సు అగ్నిప్ర‌మాదానికి గురైంది. హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తున్న ఓ ప్ర‌యివేటు బ‌స్సులో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. ఈ ప్ర‌మాదం నుంచి 39 మంది ప్ర‌యాణికులు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు.

ఎన్టీఆర్ జిల్లాలోని పేరాల‌పాడు – ఎన్ఎస్‌పీ కెనాల్ రోడ్డులోని కీస‌ర వ‌ద్ద శ‌నివారం ఉద‌యం ఈ ప్ర‌మాదం సంభ‌వించిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. బ‌స్సులో అగ్నిప్ర‌మాదం సంభ‌వించిన వెంట‌నే ప్ర‌యాణికులు హుటాహుటిన కింద‌కు దిగి ప్రాణాల‌ను కాపాడుకున్నార‌ని పోలీసులు తెలిపారు. త‌మ‌కు స‌మాచారం అంద‌గానే ఫైరింజ‌న్ల‌తో ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశామ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.