Prakash Raj : దేశంలో హంతకుడి పాలన కొనసాగుతుంది
విశాఖలో సీఐటీయూ మహాసభల సందర్భంగా ప్రకాష్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో హంతకుడి పాలన సాగుతోందని ప్రధానిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివాజీ వివాదంపై అనసూయకు మద్దతు పలికారు.
విధాత : దేశ ప్రజలు ఓ హంతకుడిని ఎన్నుకున్నారని..దేశంలో హంతకుడి పాలన కొనసాగుతుందని సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు. విశాఖలో సీఐటీయూ మహాసభలో ప్రారంభించేందుకు ఆయన వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్లపైన మీడియా ప్రశ్నకు ప్రకాష్ రాజ్ బదులిస్తూ పరోక్షంగా ప్రధాని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశ ప్రజల్లో మతోన్మాత భావజాలాన్ని రెచ్చగొట్టేందుకు కేంద్రం, బీజేపీ కోట్లాది రూపాయాలను ఖర్చు చేస్తుందని..ప్రధాని స్వయంగా కేరళా ఫైల్స్ చూడమంటారని ప్రకాష్ రాజ్ విమర్శించారు. జెనో ఫోభియాతో తీసే సినిమాల వెనుక విషం ఉందన్నారు. కుర్చీని నిలబెట్టుకోవడం కోసం చేసే ప్రయత్నాలు నిరంతరం జరుగుతుంటాయని.. ప్రజలు రాజకీయం చేయాలి.. పాలకులు పని చేయాలి కానీ రాజకీయం మన దగ్గర అది రివర్స్ అయిందని వ్యాఖ్యానించారు. ఐదేళ్లకు వచ్చి వెళ్ళే వాళ్ళు.. ప్రజలు వారిలో ఎవరు పర్మినెంట్?.. ఇదే ఇప్పుడు డిస్కషన్ అన్నారు. మీడియా కూడా సిగ్గు లేక అమ్ముడుపోయిందని.. ఇండిపెండెంట్ మీడియా కొంత మేలు అని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.
మావోయిస్టులను ఎన్ కౌంటర్లు చేయకుండా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని..ఇదేమి ఆపరేషన్ సిందూర్ కాదుకదా అని..మన పౌరులను మనమే ఎన్ కౌంటర్లు చేయడం ఏమిటని..వారేమి టెర్రరిస్టులు కాదుకదా అని ప్రశ్నించారు. మీ ఐడియాలాజీ కాకపోతే..చర్చించి మాట్లాడవచ్చన్నారు. గొంతు విప్పితే ఈడీ రైడ్ లు, కేసులు, అరెస్టులు ఎందుకని కేంద్రాన్ని విమర్శించారు.
ఐబొమ్మ రవి ఇష్యూపై స్పందించిన ప్రకాష్ రాజ్ ..దొంగతనం ఎవరు చేసినా తప్పే కదా అని వ్యాఖ్యానించారు. సినిమా టికెట్ ధర ఎక్కువ అనిపిస్తే చూడకండి అన్నారు. దొంగతనం చేసే వాడు హీరో ఎలా అవుతాడు? అన్నారు. దేశానికే ఓ పెద్ద దొంగ మహా ప్రభువు అయ్యాడని మరోసారి పరోక్షంగా మోదీని విమర్శించారు.
శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాష్ రాజ్ ఆడవాళ్ల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు అన్నారు.
శివాజీ మాట్లాడింది ముమ్మాటికీ తప్పు అని స్పష్టం చేశారు. మహిళల పట్ల వాడే ఆ భాష ఏంటి? అని, ఆడవాళ్లంటే ఏమనుకున్నారు? అని, వారి పట్ల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలన్నారు. ఆ అహంకారం ఏంటి? తరతరాలుగా ఆడవాళ్లకి మగవాళ్ల నుంచే కదా అన్యాయం జరుగుతోంది. ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు నీకు సంస్కారం ఉండాలి’ అంటూ శివాజీ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. అనసూయ లాంటి వారిని నేను సపోర్ట్ చేస్తాననని.. ఆడవాళ్లకి సపోర్ట్ చేయడం నా బాధ్యత. అది మా కర్తవ్యం అని ప్రకాష్ రాజ్ తెలిపారు. మీకు ఏదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే చెప్పాల్సిన రీతిలో చెప్పాలన్నారు. శివాజీ క్షమాణలు చెప్పిన మహిళలు వదలబోరన్నారు. శివాజీ కానీ, ఎవరైనా గానీ.. ఒక వేదిక మీద మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
Chandrababu Naidu : జిల్లాల పునర్విభజనలో ప్రజాభిప్రాయానికే పెద్దపీట
Actor Shivaji : మహిళా కమిషన్ ముందుకు నటుడు శివాజీ
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram