Maha Shivaratri | మహా శివరాత్రితో ఈ ఆరు రాశులకు శని నుంచి ఉపశమనం..!
Maha Shivaratri | మహా శివరాత్రి( Maha Shivaratri )కి సమయం దగ్గరపడుతోంది. అయితే ఫిబ్రవరి 15న వస్తున్న శివరాత్రికి ఒక ప్రత్యేకత ఉంది. శనీశ్వరుడికి అధిష్ఠాన దేవత అయిన శివుడికి సంబంధించిన పర్వదినం అయినందు వల్ల శివరాత్రి నాడు శివుడి( Lord Shiva )ని పూజిస్తే శని దోషాలున్న వారికి ఆ దోషం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఆరు రాశుల( Zodiac Signs ) వారికి శని దోషం నుంచి ఉపశమనం కలగనుంది. మరి ఆ ఆరు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
Maha Shivaratri | శనిదోషం కలిగిన వారికి ఫిబ్రవరి 15న వచ్చే మహా శివరాత్రి( Maha Shivaratri ) కలిసి రానుంది. ప్రస్తుతం మీన రాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడి వల్ల మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు శని దోషంతో బాధపడుతున్నారు. అష్టకష్టాలు పడుతున్నారు. అయితే మహా శివరాత్రి రోజున ఈ ఆరు రాశుల( Zodiac Signs ) వారు భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో పూజలు చేస్తే.. శని దోషం నుంచి బయటపడొచ్చు. తద్వారా ఆర్థికంగా, వ్యక్తిగతంగా లాభపడే అవకాశం ఉంది.
మేషం (Aries)
మహా శివరాత్రి పర్వదినాన మేష రాశి వారు తప్పనిసరిగా శివుడిని పూజించాలి. ఆ రోజున శివుడిని రుద్రాష్టకంతో పూజిస్తే శనిదోషం తగ్గిపోనుంది. ఏలినాటి శని కూడా తొలగిపోయి.. ఆదాయ మార్గాలు పెరగడం, విదేశాల్లో ఉద్యోగం లభించడం, పెట్టుబడులు పెరగడం, వైద్య ఖర్చులు తగ్గిపోతాయి. ఆస్తి వివాదాలు కూడా పరిష్కారమవుతాయి.
సింహం ( Leo )
సింహ రాశి వారు అష్టమ శని దోషం సతమతమవుతున్నారు. దీంతో చేపట్టిన ప్రతి పనిలో ఆటంకం కలగడం, ఆదాయం పెరగకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఖర్చులు పెరగడం, మానసిక ఒత్తిడికి గురి కావడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శివరాత్రి నాడు శివుడిని బిల్వ పత్రాలతో పూజించడం వల్ల జీవితంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. అనేక పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదాయ వనరులు పెరిగి.. ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది.
కన్య (Virgo)
ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లో పురోగతి స్తంభించిపోవడం, లాభాలు తగ్గడం, పదోన్నతులు ఆగిపోవడం, పెళ్లి ప్రయత్నాలు ఫలించకపోవడం, ప్రేమ వ్యవ హారాల్లో ఆటంకాలు ఏర్పడడం, ఉద్యోగం లభించకపోవడం, దుర్వార్తలు ఎక్కువగా వినడం వంటివి జరిగే అవకాశం ఉంది. శివరాత్రి రోజున శివార్చన చేయడం లేదా శివాష్టకం చదువుకోవడం వల్ల తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడి, బాగా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
ధనుస్సు (Sagittarius)
అర్దాష్టమ శని దోషం వల్ల ధనుస్సు రాశి వారు అనేక ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం తగ్గిపోయి.. పదోన్నతులు ఆగిపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఆస్తి వివాదాలు కూడా అధికమవుతున్నాయి. కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు. కాబట్టి మహా శివరాత్రి రోజున శివుడికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేయడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మళ్లీ ప్రాధాన్యం పెరగడంతో పాటు, ఇతర సమస్యలు కూడా సమసిపోతాయి.
కుంభం (Aquarius)
ఈ రాశికి ప్రస్తుతం ఏలిన్నాటి శని చివరి దశ జరుగుతోంది. దీని వల్ల ఆదాయం పెరగకపోవడం, తక్కువ ఆదాయానికి ఎక్కువగా శ్రమపడడం, రావలసిన డబ్బు రాకపోవడం, సహాయం పొందిన వారు ముఖం చాటేయడం, జీతభత్యాలు పెరగకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మహా శివ రాత్రి నాడు శివుడిని నియమ నిష్ఠలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఉండడం వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోవడంతో పాటు ఆదాయం విశేషంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
మీనం ( Pisces )
ఈ రాశికి ప్రస్తుతం రెండవ దశ ఏలిన్నాటి శని దోషం జరుగుతోంది. దీనివల్ల శ్రమ ఎక్కువ ప్రయో జనం తక్కువగా ఉంటుంది. ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం, అనారోగ్య సమస్యలు తలె త్తడం, ఉద్యోగంలో ప్రాధాన్యం తగ్గడం, ఆదాయం బాగా తగ్గడం, అనవసర ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. శివరాత్రి నాడు భక్తి శ్రద్ధలతో శివార్చన చేయడం వల్ల ఈ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram