Anasuya | అన‌సూయ‌ని హీరోయిన్ రాశి అంత మాట అనేసింది ఏంటి.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్

Anasuya | టాలీవుడ్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో విషయం మహిళా కమిషన్ వరకు వెళ్లింది.

  • By: sn |    movies |    Published on : Jan 05, 2026 1:52 PM IST
Anasuya | అన‌సూయ‌ని హీరోయిన్ రాశి అంత మాట అనేసింది ఏంటి.. వైర‌ల్ అవుతున్న కామెంట్స్

Anasuya | టాలీవుడ్‌లో హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో విషయం మహిళా కమిషన్ వరకు వెళ్లింది. చివరకు శివాజీ క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం ఒక దశలో చల్లారినట్టే అనిపించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో అనూహ్యంగా యాంకర్-నటి అనసూయ పేరు ఎక్కువగా వినిపించింది.

అనసూయ ఘాటైన స్పందన

శివాజీ వ్యాఖ్యలపై అనసూయ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “ఆడవాళ్లు ఏ బట్టలు వేసుకోవాలో చెప్పే హక్కు ఎవరికీ లేదు. మా శరీరం, మా ఇష్టం” అంటూ గట్టి కౌంటర్లు ఇచ్చారు. అంతటితో ఆగకుండా వరుసగా వీడియోలు, పోస్టులు చేస్తూ శివాజీని టార్గెట్ చేశారు. దీంతో ఈ వివాదం మరింత పెద్దదైంది.

విభిన్న అభిప్రాయాలు

ఈ క్రమంలో సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా అభిప్రాయాలు వినిపించాయి. కొందరు అనసూయ స్టాండ్‌కు మద్దతు తెలుపగా, మరికొందరు మాత్రం శివాజీ మాటల విధానం తప్పు కావొచ్చు కానీ ఆయన చెప్పాలనుకున్న అంశంలో నిజం ఉందంటూ ఆయనకు సపోర్ట్ చేశారు. ఇదే సమయంలో అనసూయపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

రంగప్రవేశం చేసిన సీనియర్ నటి రాశి

ఈ వివాదంలో తాజాగా సీనియర్ హీరోయిన్ రాశి కూడా స్పందించి హాట్ టాపిక్‌గా మారారు. పేరు ప్రస్తావించకుండానే అనసూయను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాశి మాట్లాడుతూ, “శివాజీ చెప్పింది 100 శాతం తప్పు కాదు. కానీ ఆయన వాడిన పదాల్లో కొంత తప్పు ఉంది. అందుకే ఆయన క్షమాపణలు చెప్పారు. అయినా కొంతమంది మాత్రం హద్దులు దాటి మాట్లాడుతున్నారు” అన్నారు.

పాత ఘటనను గుర్తుచేసిన రాశి

అదే సమయంలో ఒక టీవీ షోలో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక షోలో యాంకర్‌గా ఉన్న ఆవిడ ‘రాశిగారి ఫలాలు’ అనే పదాన్ని వాడారు. దానికి అక్కడ ఉన్న జడ్జిలు కూడా నవ్వారు. ఒక మహిళగా అలా మాట్లాడటం సరైనదేనా? అప్పట్లో ఈ విషయాన్ని లీగల్‌గా తీసుకెళ్లాలనుకున్నాను. కానీ మా అమ్మ అడ్డుకోవడంతో ఆపేశాను” అని చెప్పారు. రాశి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం, అనసూయ స్పందనతో ముదిరి, ఇప్పుడు రాశి కామెంట్స్‌తో మరో కొత్త మలుపు తిరిగిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఈ వ్యవహారం టాలీవుడ్‌లో వ్యక్తిగత అభిప్రాయాలు, బాధ్యతాయుతమైన మాటలపై మరోసారి పెద్ద చర్చకు దారి తీసింది.